అదొక్కటే కరోనా నియంత్రణకు మూలం

26 Mar, 2020 20:29 IST|Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌ : గృహ నిర్బంధమే కరోనా నియంత్రణకు మూలమని, ప్రజలు ఎవరికి వారుగా సామాజిక దూరం పాటించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా స్థాయి సమీక్షాసమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరోనా కట్టడికి జిల్లాలో ఏర్పాట్లు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయల మార్కెట్, కిరాణం షాపు వద్ద శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక  ధాన్యం కొనుగోలు కేంద్రం  ఏర్పాటు చేయాలన్నారు. మామిడి ఇతర ప్రాంతాలకు ఎగుమతి లేని దృష్ట్యా మామిడి మాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అనాథలు, బిచ్చగాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భోజన వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.

మరిన్ని వార్తలు