ఘనంగా హనుమాన్‌ జయంతి

1 Apr, 2018 09:05 IST|Sakshi
ఈదులూరులో ర్యాలీ నిర్వహిస్తున్న భక్తులు, పూజల్లో పాల్గొన్న నాయకులు

కట్టంగూర్‌ : హనుమాన్‌ జయంతి వేడుకలను మండలంలోని ఈదులూరు, కట్టంగూర్, అయిటిపాముల, చెర్వుఅన్నారం, పామనగుండ్ల గ్రామాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టంగూర్, ఈదులూరు గ్రామాల్లో భక్తులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నరేష్, రమేష్, కిరణ్‌కుమార్, శ్రావణ్‌కుమార్, రమేష్, మోహన్, గుడిసె రవి, యశ్వంత్, శివశంకర్, మనోహర్‌ ఉన్నారు. 
నార్కట్‌పల్లి : స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌జయంతిని  శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు జానకిరామ శర్మ అర్చక బృందం ఆధ్వర్యంలో గాయత్రి హోమం, సహస్ర నామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పూజా కార్యక్రమానికి  ఎంపీపీ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి సతిమణి రేగట్టే శోభారెడ్డి,  జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, అండాలు,  వైస్‌ ఎంపీపీ పుల్లెంల పద్మ ముత్తయ్య, సర్పంచ్‌ పుల్లెంల అచ్చాలు, అయిలమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ చైర్మన్‌ అనంతుల నాగరాజు చంద్రకళలు సన్మానం చేశారు. పూజా కార్యక్రమంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్‌ సామ కొండల్‌రెడ్డి, కట్ట కిరణ్‌కుమార్, ముంత నర్సింహ, నడింపల్లి శ్రవణ్‌కుమార్, బొడ్డ నాగరాజు, ఐతరాజు రమేష్‌  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు