ప్రమాణాలు పాటించకుంటే.. రిజిస్ట్రేషన్‌ రద్దు

7 Jan, 2020 02:45 IST|Sakshi

కనీస వసతులు లేకుండా ఆస్పత్రులు నడపడం కుదరదు

సాక్షి, హైదరాబాద్‌: కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ను అమలు చేసేందుకు అవసరమైన నిబంధనలను ఖరారు చేసే పనిలో వైద్య ఆరోగ్యశాఖ నిమగ్నమైం ది. ఈ నిబంధనల ఖరారు కమిటీ చైర్మన్, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌రెడ్డి.. ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించి తుది ముసాయిదా రూపొందించారు. గతంలో నిబంధనలున్నా ఆసుప త్రులు పట్టించుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకుండానే ఇష్టారాజ్యంగా ఆసుపత్రులను నెలకొల్పాయి.

ప్రమాణాలు, నిపుణులైన వైద్య సిబ్బంది లేకపోవడంతో అనేక ఆసుపత్రులు నాసిరకంగా నడుస్తున్నాయి. జవాబుదారీతనం లేకుండా పోయిందని, దీంతో రోగులకు సరైన వైద్యం అందడంలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ తీసుకొచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీని అమలుకు అవసరమైన నిబంధనలను ఖరారు చేసి ముసాయిదాను కమిటీ తయారు చేసింది. వాటిని అమలు చేసేలా త్వరలో ఉత్తర్వులు జారీకానున్నాయి. అయితే ఉత్తర్వులు నేరుగా జారీచేస్తారా? లేక మళ్లీ వాటికి అసెంబ్లీ ఆమోదం తీసుకుంటారా? అన్న విషయంపై స్పష్టత లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 

డయాగ్నస్టిక్‌ సెంటర్లకు కూడా..
కనీస ప్రమాణాలు ఏముండాలన్న దానిపై ముసాయిదాలో స్పష్టత ఇచ్చారు. అల్లోపతితోపా టూ ఆయుష్‌ ఆస్పత్రుల ఏర్పాటుకు కూడా క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ వర్తిస్తుందని ముసాయిదా లో పేర్కొన్నారు. గతంలో డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ పరిధిలో లేవు. ఇక నుంచి వాటిని కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో వందలాది డయాగ్నస్టిక్‌ సెంటర్లు కనీస ప్రమాణాలు పాటించకుండానే నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అవిచ్చే వైద్య పరీక్షల రిపోర్టులపై అనేక అనుమానాలున్నాయి. ఆ రిపో ర్టుల ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలన్న కీలకమైన నిర్ణయాన్ని నిబంధనల్లో పొందుపరిచారు. 

నాలుగు రకాలుగా ఆస్పత్రులు..
ఇక ఒక ఆస్పత్రి ఏర్పాటులో మౌలిక సదుపాయాలు, పరికరాలు, మందులు, వైద్య సిబ్బంది, వాటితోపాటు నాణ్యమైన వైద్య సేవలు అందించే పరిస్థితులు ఉండాలి. వైద్య సిబ్బందికి సరైన అర్హత, శిక్షణ ఉండాలనేది మరో కీలకాంశం. క్లినిక్, పాలీక్లినిక్, నర్సింగ్‌ హోం, డస్పెన్సరీ తదితరమైన వాటికి కచ్చిత మైన ప్రమాణాలను నిర్దేశించారు. ఒక క్లినిక్‌ ఏర్పాటుకు రిసెప్షన్, వెయిటింగ్‌ గది అనేది కనీసం 35 చద రపు అడుగుల్లో ఉండాలి. డాక్టర్‌ కన్సల్టెన్సీ గది 10 చదరపు అడు గు లు ఉండాలి. స్టోర్, ఫార్మసీకి 40 చదరపు అడుగుల గది ఉండాలి. ఆస్పత్రులను క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 4 రకాలుగా విభజిం చింది. హాస్పిటల్‌ లెవల్‌ 1 (ఏ), లెవల్‌ 2 (నా న్‌ టీచింగ్‌), లెవల్‌ 3 (నాన్‌ టీచింగ్‌–సూపర్‌ సెష్పాలిటీ సర్వీస్‌), లెవల్‌ 4 (బోధనాస్పత్రు లు) ఉంటాయి. ఆస్పత్రుల్లో పడకల మధ్య దూరం ఎంతుండాలనే విషయాన్నీ ఇందులో పొందుపరిచారు. ఇలా ప్రతి దానిపై స్పష్టత ఉండేలా ఈ నియమ నిబంధనలు ఉండబో తున్నాయి. అలాగే ఆసుపత్రుల ముందు వివిధ వైద్య చికిత్సలకయ్యే ఖర్చు, ఫీజుల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. 

మరిన్ని వార్తలు