నేడు, రేపు రాష్ట్రంలో వడగాడ్పులు

13 Jun, 2019 02:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గురు, శుక్రవారాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు ఈశాన్య, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగు తోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా బుధవారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండంల్లో ఏకంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, మెదక్‌ల్లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్, నల్లగొండల్లో 41 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 39, హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.  

మరిన్ని వార్తలు