వివరాల్లేకుండా సమావేశానికొస్తారా?

26 Jun, 2016 01:04 IST|Sakshi

అధికారులపై హౌస్ కమిటీ ఆగ్రహం

 

హైదరాబాద్:  ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలు, కబ్జాలపై పూర్తి వివరాల్లేకుండా సమావేశానికి హాజరైన అధికారులపై హౌస్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. సమావేశంలో గతంలో ఏపీఐఐసీకి కేటాయించిన భూము లు, అందులో జరిగిన అక్రమాల్ని సమీక్షించా రు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్, హన్మకొండ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని అసైన్డు భూములపై సమీక్ష జరిగింది. అయితే, అధికారులు వీటిపై పూర్తి వివరాల్లేకుండా సమావేశానికి హాజరయ్యారు. దీంతో వచ్చే సమావేశానికి అన్ని వివరాలతో రావాలని హౌస్ కమిటీ సభ్యులు వారిని ఆదేశించారు.


ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. జీఓ 58, 59 ద్వారా బడా బాబుల భూములను క్రమబద్ధీకరించవద్దన్నారు. ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు మాత్రమే ప్రయోజం చేకూరేలా నిర్ణయాలుండాలన్నా రు. ప్రభుత్వ భూములను ఏ ప్రయోజనం కోసం ఇచ్చారో, దానికోసమే వినియోగించాలని, లేనిపక్షంలో వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యుల్లో ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, ఎన్‌వీవీఎస్  ప్రభాకర్, మిరాజ్ హుస్సేన్, రేఖానాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్ సమావే శానికి హాజరయ్యారు.

 

మరిన్ని వార్తలు