3నెలల అద్దె వద్దన్న యజమాని

23 Apr, 2020 09:58 IST|Sakshi

దామోదర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కిరాయిదార్లు

భాగ్యనగర్‌కాలనీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల జీవితాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు ఏర్పాడ్డాయి. గత నెల రోజులుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంతో ఎవరూ పనులు చేసుకోలేక ఇంటికే పరిమితమయ్యారు. అయితే నెల రోజులుగా పని చేయకపోవడంతో ఇంటి అద్దె, నిత్యావసరాలకు ఇబ్బందులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఇంటి అద్దె విషయంలో ఇళ్ల యజమానులు కిరాయిదార్లను ఇబ్బందులు పెట్టొదని కోరారు. హైదర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ గౌరవ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డికి తులసినగర్‌లో సొంత ఇల్లు ఉంది. అందులో 10 పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి పరిస్థితి తెలిసిన దామోదర్‌రెడ్డి మూడు నెలల వరకు అద్దె చల్లించాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆ పది కుటుంబాలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాయి.(ప్రార్థనలు ఇలా..)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు