జన్యుపదార్థం హైజాక్‌...

22 Mar, 2020 02:11 IST|Sakshi

వైరస్‌ తాలూకు ఆర్‌ఎన్‌ఏ మన కణంలోని జన్యు పదార్థాన్ని హైజాక్‌ చేయడంతో సమస్య మొదలవుతుంది. శరీర వ్యవస్థ మానవ ప్రొటీన్లకు బదులుగా వైరస్‌ తాలూకు ప్రొటీన్లు తయారు చేయడం మొదలుపెడుతుంది. ఇది కాస్తా వైరస్‌ ఆర్‌ఎన్‌ఏల సంఖ్య పెరిగేందుకు కారణమవుతుంది. మరికొన్ని ఇతర వైరస్‌ ప్రొటీన్లు కణాలను నిర్వీ ర్యం చేస్తాయి. కణాలు శరీరానికి అవసరమైన పనులు కాకుండా.. వైరస్‌కు కావాల్సిన పనులు చేయడంలో బిజీ అయిపోతాయి. వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ అవి కణం బయటకు వచ్చేసి మరిన్ని కణాలను ఆక్రమించేస్తాయి. ఊపిరితిత్తులు, గొంతు, నోరు మొత్తం వైరస్‌లతో నిండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క రోజులో లక్షల రెట్లు పెరిగిపోయే వైరస్‌ రక్తం ద్వారా జీర్ణ వ్యవస్థలోకి చేరుతుంది.

మరిన్ని వార్తలు