ఏపీ మెమోలు ఎలా ఇస్తారు?

29 May, 2015 23:05 IST|Sakshi

ఇంటర్ బోర్డును వివరణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతో మార్కుల జాబితా జారీ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ‘టీ విద్యార్థులకు ఏపీ బోర్డు మెమోలు’ శీర్షికన ఈనెల 27న సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక కోరింది. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్ష రాసిన వారికి ఏపీ ఇంటర్మీడియెట్ పేరుతో మెమోలు ఇవ్వడమేంటని, ఇందుకు గల బాధ్యులు, కారణాలపై నివేదిక అందజేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించినట్లు తెలిసింది.

రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కటే కంప్యూటర్ ల్యాబ్ ఉండటం, రెండు రాష్ట్రాల విద్యార్థుల మెమోల ముద్రణకు సంబంధించిన ముందస్తు పనులన్నీ ఒకే ల్యాబ్‌లో జరగడం వల్ల పొరపాటు జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించేందుకు సిద్ధమైనట్లు తెలి సింది. ఏదేమైనా ఈ అంశం విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్నం దున ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు