దామరచర్లలో హెచ్ఆర్ఎఫ్ ధర్నా

26 Dec, 2015 12:31 IST|Sakshi

నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన భారీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రచారం ప్రారంభించింది. విద్యుత్ ప్రాజెక్టు వల్ల కలిగే అనర్థాల గురించి ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు వేదిక నాయకులు వివరిస్తున్నారు. థర్మల్‌కు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కార్యదర్శి మోహన్ జిల్లా నాయకులు, పర్యావరణ వేత్త బాబూరావు తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు