వాటర్‌గ్రిడ్‌కు ‘హడ్కో’ అవార్డు

26 Apr, 2015 01:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ప్రత్యేక అవార్డును ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు అభినందనలు తెలుపుతూ హడ్కో అధికారులు లేఖ పంపారు. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు