సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

4 Apr, 2020 04:21 IST|Sakshi
కేటీఆర్‌కు చెక్‌ అందజేస్తున్న వీఎస్టీ ఎండీ లహరి. చిత్రంలో నాయిని

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయనిధికి శుక్రవారం పలువురు విరాళాలు అందజేశారు. పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు విరాళాలకు సంబంధించిన చెక్కులను ప్రగతిభవన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు అందజేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేసిన వారికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పరిశ్రమల సమాఖ్య తరఫున అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి రూ. 1.22 కోట్లు, సాయి లైఫ్‌ సైన్సెస్, హువావే ఇండియా లిమిటెడ్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్, జీఎస్‌జీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్, ఆవ్రా ల్యాబొరేటరీ కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేశారు.

బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ తరఫున రూ. 50 లక్షల రూపాయల చెక్కును సినీనటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అందజేశారు. టీఎస్టీసీ స్పోర్ట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, సహృదయ హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వెన్సా ఫౌండేషన్, రవి ఫుడ్స్, గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ రూ.25 లక్షల చొప్పున చెక్కులను విరాళంగా అందజేశారు. వేసెళ్ళ మీడోస్, సికింద్రాబాద్‌ క్లబ్‌ రూ.20 లక్షల చొప్పున, జలవిహార్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ రూ.15 లక్షల చొప్పున చెక్కులను కేటీఆర్‌కు అందించారు. సామ్రాట్‌ ఐరన్స్, పుష్పభూమి ఎస్టేట్‌ డెవలపర్స్, మహేశ్వరి భవన్‌ ట్రస్ట్, గ్రీన్‌రిచ్‌ ఎస్టేట్స్, ఫెయిర్‌ మౌంట్‌ బిల్డర్స్‌ 11 లక్షలు అందజేశాయి. అభిరుచి స్వగృహ ఫుడ్స్, వంశీరామ్‌ హోమ్స్, త్రివేణి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ఎన్‌.సాయిబాబా అండ్‌ కంపెనీ, శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్, జెమ్‌ అవెన్యూస్, పట్నం మహేందర్‌రెడ్డి హాస్పిటల్, టీఎస్‌ఐసీ ఎంప్లాయీస్, కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ రూ.10 లక్షల చొప్పున విరాళాలకు సంబంధించిన చెక్కులను అందించాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా