సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ 

8 Apr, 2020 03:22 IST|Sakshi
సోమవారం సీఎం కేసీఆర్‌కు రూ.కోటి చెక్కును అందజేస్తున్న జీఎంఆర్‌ గ్రూప్‌ సంస్థ డైరెక్టర్‌ చల్లా ప్రసన్న. చిత్రంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా మంగళవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌)కు విరాళాలు అందజేశారు. కరీంనగర్‌ గ్రానైట్‌ వ్యాపారులు మొత్తం రూ.75 లక్షల రూపాయల నగదు, రూ.1కోటి విలువైన మందులు, వైద్య పరికరాలను విరాళంగా ప్రకటించారు. ఇందులో కరీంనగర్‌ గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రూ.50 లక్షల చెక్కును సంస్థ ప్రతినిధులు పొన్నంనేని గంగాధర్‌రావు, ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ ముఖ్యమంత్రికి అందించారు. మార్వాడీ గ్రానైట్‌ ఫ్యాక్టరీస్‌ అసోసియేషన్‌  తరఫున రూ.25 లక్షల చెక్కును ఆ సంస్థ యజమానులు గోపీ మహేశ్వరి, రాజేశ్‌ అగర్వాల్, ముఖేశ్‌ పర్వాల్‌ ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌కు మరో రూ.6.80 కోట్ల విరాళాలు
ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు రూ.6.80 కోట్ల విలువ చేసే చెక్కులను 25 మంది దాతలు అందజేశారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమక్షంలో విజ్‌ రియల్టర్స్‌ కోటి రూపాయల చెక్కును అందజేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌సైరా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో పెన్నా సిమెంట్స్, రత్నదీప్‌ ప్రైవేటు లిమిటెడ్‌ రూ.1 కోటి చొప్పున చెక్కులను సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు.

సుజన చారిటబుల్‌ ట్రస్టు రూ.50 లక్షలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి సీఎం సహాయ నిధి పేరిట కేటీఆర్‌కు చెక్కును అందజేశారు. దొడ్ల డెయిరీ లిమిటెడ్, ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్, వశిష్ట  కన్‌స్ట్రక‌్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గాయత్రి గ్రానైట్స్‌ రూ.25 లక్షల చొప్పుల విరాళం అందజేశాయి. అగ్రసేన్‌  కో–ఆపరేటివ్‌ అర్బన్‌  బ్యాంక్‌ రూ.21 లక్షలు, నీరూస్‌ ఎన్‌సెంబుల్స్‌ రూ.20 లక్షలు, రిజెనెసిస్‌ ఇండస్ట్రీస్‌ రూ.10లక్షలు అందజేసింది.  హైదరాబాద్‌లోని పీఓటి మార్కెట్‌లో వృత్తి పనిచేసే స్వర్ణ కారులు 39 మంది రూ.7.32లక్షల చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి సీనియర్‌ సంపాదకులు ఏబీకే ప్రసాద్‌ విరాళం అందజేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు రూ.50వేల చొప్పున విరాళాన్ని చెక్కు రూపంలో పంపించారు.

ఫ్రీడం ఆయిల్‌ రూ.2.5కోట్ల విరాళం
ఫ్రీడం హెల్తీ కుకింగ్‌ ఆయిల్స్‌ తయారీదారు జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జీఈఎఫ్‌ ఇండియా) సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల చెక్కును అందజేసింది. కరోనాపై కేంద్రం, రాష్ట్రాలు జరుపుతున్న పోరాటానికి సంఘీభావంగా ఇప్పటివరకు రూ.2.5 కోట్ల విరాళాన్ని అందజేసిట్లు సంస్థ ఎండీ ప్రదీప్‌ చౌదరి ప్రకటించారు.  

మరిన్ని వార్తలు