రేకుల ఇంటికి రూ.1.80 లక్షల కరెంటు బిల్లు 

18 Jun, 2020 07:28 IST|Sakshi

సాక్షి, చిట్యాల : నీడ కోసం నిర్మించుకున్న రేకుల ఇంటికి వచ్చిన కరెంట్‌ బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా ఒక లక్షా ఎనభై వేల రూపాయలు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన శీలం సదయ్య పశువుల కాపరీగా పని చేస్తున్నాడు. ఆయనకు రెండు గదుల రేకుల ఇల్లు ఉంది. అందులో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ ఉంది. ఇటీవల విద్యుత్‌ శాఖ సిబ్బంది రీడింగ్‌ తీసి బిల్లు ఇచ్చారు. ఏకంగా రూ.1.80 లక్షల బిల్లును చూసి హడలెత్తిపోయిన సదయ్య.. నాలుగు రోజులుగా కరెంట్‌ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. అయినా తనను పట్టించుకున్నవారే లేరని, విద్యుత్‌ ఏఈకి ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని బాధితుడు వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేయాలని 
కోరుతున్నాడు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు