శ్రీశైలం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద

24 Oct, 2019 03:17 IST|Sakshi

నేడు మరింత పెరిగే అవకాశం 

10 గేట్లు ఎత్తి 4.35 లక్షల క్యూసెక్కులు దిగువకు.. 

సాక్షి, అమరావతి: పశ్చిమ కనుమల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం.. తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం జలాశయంలోకి పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న నీటిని పది గేట్లను ఎత్తి, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 4.35 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కృష్ణా నది నుంచి నాగార్జునసాగర్‌లోకి 4.47 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.34 లక్షల క్యూసెక్కులను 18 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది.

ఆ ప్రాజెక్టులోకి 3.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేస్తూ 4.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల వద్ద వరదను నియంత్రిస్తూ ప్రజలు ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతోంది. బ్యారేజీలోకి 2.10 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1.88 లక్షల క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ 589.937 టీఎంసీల కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. 

ఉత్తుంగ తరంగంలా.. 
నాలుగు రోజులుగా తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తుంగభద్ర ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర జలాశయంలోకి 1.44 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో 1.69 లక్షల క్యూసె క్కులు దిగువకు విడుదల చేశారు. దాంతో తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయి కి చేరింది. మంత్రాలయం, కర్నూలు వద్ద వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి భారీగా వరద చేరుతోంది. బుధవారం ఎగు వ నుంచి భారీ వరద దిగువకు విడుదల చేయగా.. గురువారం కూడా నదీ పరీవాహక ప్రాంతం లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయా నికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

శ్రీశైలంలోకి మరింత వరద.. 
నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం పోటెత్తింది. ఆల్మట్టిలోకి 2.11 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో దిగువకు 2.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ జలాశయం నుంచి 3.71 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఉజ్జయినిలోకి భీమా వరద ప్రవా హం స్థిరంగా కొనసాగుతోంది. దాంతో మిగులుగా ఉన్న 65 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాలలోకి 3.65 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.84 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం జగన్‌ సమీక్ష

భారీ వర్ష సూచన: సెలవు ప్రకటన

విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదుకు తేదిలు ఖరారు

ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద

ధర్మాడి సత్యం బృందంపై కలెక్టర్‌ ప్రశంసలు

'ఆంధ్ర జాలర్లను క్షేమంగా తీసుకొస్తాం'

‘రాజధానిని ఎవరైనా ఎత్తుకుపోయారా’

ఈనాటి ముఖ్యాంశాలు

కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత

మరో పథకానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

తిరుపతిలో మద్యపాన నిషేదం..!

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా సీఎం జగన్‌ అడుగులు

ఒకసారి భార్యా బిడ్డల గురించి ఆలోచించండి

శ్రీవారిని దర్శించుకున్న తమిళిసై

దరిద్ర ఆర్థికస్థితిని వారసత్వంగా ఇచ్చారు: బుగ్గన

అత్తామామలు ఇంట్లోంచి గెంటేశారు

నారాయణ స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

ఉల్లి లొల్లి తగ్గింది!

ఎడతెరిపిలేని వర్షాలు.. స్కూళ్లకు సెలవు

గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి

బాబూ..మీరు మళ్లీ ఎందుకు రావాలి?

బొర్రా టిక్కెట్ల ధరల్లో స్వల్ప మార్పు

అమ్ముకున్నారు.. రెచ్చగొడుతున్నారు

‘టచ్‌’ మహిమతో వారికి దరిద్రాన్ని అంటించారు’

ఊపిరి నిలిపిన మానవత్వం

బాస్‌.. నడిపించేవారేరీ ?

అమ్ముకున్నారు.. రెచ్చగొడుతున్నారు

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు

ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ప్రజలతోనే

ఇంజినీరింగ్‌ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ

మిస్‌ మార్వెల్‌ అవుతారా?

మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో...

పరమానందయ్య శిష్యులు

నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

మహిళలకు విజిల్‌ అంకితం