పరుగులు పెట్టించిన వాన..

3 Apr, 2014 03:15 IST|Sakshi

కొందుర్గు,/జడ్చర్ల,/జడ్చర్లటౌన్,/ఊట్కూర్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా బుధ వారం చిరుజల్లులు కురిశాయి. జిల్లా కేంద్రంతోపాటు, నారాయణపేట డివిజన్ ప్రాం తంలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షం కురిసిం ది. బలంగా వీచిన ఈదురుగాలులకు మామిడి కాయాలు నేలరాలాయి. కూరగాయల పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.  జడ్చర్లలో కురిసిన వర్షం కారణంగా విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం మార్కెట్‌లో తడిపోయింది. దీంతో రైతులు తడిసిన పంటను ఆరబెట్టుకునేందుకు తంటాలు పడ్డారు.   మధ్యాహ్నం 3గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఇబ్బందులకు గురయ్యారు.   కొద్దిరో జులుగా ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటం ఉపశమనం కలిగించింది. ఊట్కూర్‌కు చెందిన పీర్ మహ్మద్‌సాబ్‌కు  తోటలో మామిడికాయలు నేలరాలాయి. దీంతో రూ. 50 ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. పాలమూరు జిల్లాలో  మంగళవారం (నిన్న) రికార్డు స్థాయిలో ఈ వేసవిలోనే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది.  
 
 దీంతో బుధవారమే వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు  విక్రయానికి తీసుకువచ్చిన ధాన్యం  నీటిలో కలిసిపోరుుంది. అకాలంగా కురిసిన వానతో ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణమైంది. దీంతో  రైతులు లబోదిబో మంటున్నారు. భూత్పూర్ మండలం కప్పెటకు చెందిన రైతు కుర్వ యాదయ్య 50 బస్తాల ధాన్యాన్ని యార్డుకు తీసుకు వచ్చి ఆవరణలో ఆరబోశాడు.  సాయంత్రం అకాల వర్షం ఒక్క సారిగా కురువడంతో  తడిసి ముద్దయింది.అంతేగాక దాదాపు 15 బస్తాల ధాన్యం  కొట్టుకుపోయింది.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా