హెచ్‌ఎంటీ నుంచి ఇస్రోకు భారీ యంత్రం

19 Nov, 2018 03:23 IST|Sakshi
హెచ్‌ఎంటీ రూపొందించిన భారీ యంత్రం

హైదరాబాద్‌: హిందూస్థాన్‌ మెషీన్‌ టూల్స్‌ అరుదైన ఘనతను సాధించింది. దేశీయంగా ఇంతవరకు తయారు చేయని అతిపెద్ద యంత్రాన్ని తయారు చేసి ఇస్రోకు అందించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ కోసం సాలిడ్‌ రాకెట్‌ మోటార్స్‌ త్రీ యాక్సెస్‌ మెషినరీని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌కు హెచ్‌ఎంటీ (హైదరాబాద్‌) సంస్థ అందజేసింది. హై ఫ్రీక్వెన్సీ, ప్రెజరైజ్డ్‌ కంట్రోల్‌ రూమ్, చిప్‌ అండ్‌ డస్ట్‌ కలెక్షన్‌ వంటివి మెషీన్‌ ప్రత్యేకతలు. 200 టన్నుల లోడ్‌ సామర్థ్యం, 12.7 మీటర్ల ఎత్తు ఉన్న ఈ యంత్రం హెచ్‌ఎంటీ నిర్మించిన యంత్రాల్లో అతిపెద్దది.

ఇది ఇస్రో సాలిడ్‌ రాకెట్‌ మోటార్ల ఉత్పత్తిని పెంచడానికి ఉపకరిస్తుందని, దీన్ని రూపొందించడానికి రూ.18 కోట్లు వెచ్చించినట్లు హెచ్‌ఎంటీ హైదరాబాద్‌ యూనిట్‌ జనరల్‌ టెక్నికల్‌ మేనేజర్‌ బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ‘సాక్షి’కి తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎంటీ సేల్స్‌ డీజీఎం నరేశ్, డిజైన్స్‌ డీజీఎం రాజబాబు, ప్రొడక్షన్‌ డీజీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు