13న అల్పపీడనం అలుముకునే అవకాశం

9 May, 2020 20:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగుడా, సర్దార్ నగర్ రవీర్యాల, మంఖల్, ఇమామగుడా, హర్షగుడా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో అంధకారం అలుముకుంది.

13న అల్పపీడనం అలుముకునే అవకాశం
మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు పశ్చిమ విదర్భ, మరఠ్వాడ, దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఇంటీరియర్  కర్ణాటక  మీదుగా 0.9 కిమీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న సుమత్రా తీర ప్రాంతాలలో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

దీని ప్రభావం వలన ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న అండమాన్ సముద్రం ప్రాంతాలలో సుమారుగా మే 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిమీ) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41 నుండి 43 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంది.

మరిన్ని వార్తలు