మిర్చి అ‘ధర’హో! 

20 Mar, 2018 02:18 IST|Sakshi

క్వింటాకు రూ.10,400.. రెండ్రోజుల్లో రూ.450 పెరుగుదల

ఖమ్మం వ్యవసాయం : మిర్చి రైతులకు శుభవార్త. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి క్వింటా ధర రూ. 9,950 పలకగా, సోమవారానికి ఏకంగా రూ. 450లు పెరిగి రూ. 10,400కు చేరింది. పంట సాగు తగ్గడం, ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ధర పెరుగుతోంది. మార్చి నెల ఆరంభంలో రూ. 9,200లు పలికిన ధర క్రమంగా పెరుగుతూ 19 రోజుల వ్యవధిలో దాదాపు రూ.1,200పైకి వెళ్లడం విశేషం. ప్రతి ఏటా మార్చిలో మార్కెట్‌కు నిత్యం 70 వేల నుంచి లక్ష బస్తాల వరకు విక్రయానికి వస్తుంది. ఈ ఏడాది ప్రస్తుతం 20 వేల నుంచి 30 వేలకు మించి రావట్లేదు. అంతర్జాతీయంగా తేజా రకం మిర్చికి డిమాండ్‌ ఉండటంతో ఆ రకం ధర పెరుగుతోందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు