దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

15 Sep, 2019 02:28 IST|Sakshi
ప్రమాదానికి గురైన కారు, ఇన్‌సెట్‌లో గౌస్‌ ఉల్లా(30) (ఫైల్‌ ఫొటో) అయేషా(30) (ఫైల్‌ ఫొటో)

నగరానికి చెందిన ముగ్గురు మృతి 

మృతుల్లో కుమారుడితో సహా భార్యాభర్తలు  

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె

గోల్కొండ: దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఓ నాలుగేళ్ళ చిన్నారి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్‌కు చెందిన గౌస్‌ఉల్లా ఖాన్‌(30) నగరంలోని టోలిచౌకీలో ఉంటూ ఉద్యోగరీత్యా యూఏఈ వెళ్ళాడు. కాగా, ఇతడు శుక్రవారం ఉల్లాఖాన్‌తో పాటు భార్య అయేషా (30), కుమారుడు హమ్జ (8 నెలలు), కుమార్తె హానియా సిద్ధిఖి(3)లతో కలసి దుబాయ్‌ సలాల హైవే మీదుగా మస్కట్‌కు కారులో బయల్దేరి వెళ్తున్నాడు. అయితే ఎదురుగా వస్తున్న వాహనం వీరి కారును ఢీకొట్టడంతో గౌస్‌ఉల్లా, అయేషా, హమ్జలు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమార్తె హానియాను చికిత్స నిమిత్తం దుబాయ్‌లోని కౌలా ఆస్పత్రిలో పోలీసులు చేర్పించారు. కాగా సమాచారం అందుకున్న గౌస్‌ఉల్లాఖాన్‌ కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం మస్కట్‌కు వెళ్ళారు. ఆదివారం ఉదయం మృతదేహాలను నగరానికి తీసుకువస్తారని తెలిసింది. కాగా, ఆదివారం టోలిచౌకీ సాలార్‌జంగ్‌ కాలనీలోని మజ్జీద్‌ ఎ సాలార్‌జంగ్‌లో మధ్యాహ్నం 1ః30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా