శ్రీరాం సాగర్‌కు జలకళ

19 Aug, 2018 15:51 IST|Sakshi
శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు(పాత చిత్రం)

సాక్షి, నిజామాబాద్‌ : భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. తెలంగాణతో పాటు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1071.9 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.912 టీఎంసీలు ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి 14 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరద ఇన్‌ ఫ్లో  16,450 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిండుకుండలా మారడంపై ఆయకట్టు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాం సాగర్‌ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

మరిన్ని వార్తలు