మానవత్వం పెంచే సినిమాలు రావాలి

30 May, 2014 03:24 IST|Sakshi
  • జస్టిస్ బి. చంద్రకుమార్
  • సాక్షి, సిటీబ్యూరో: సినీ రంగ ప్రముఖులు మానవత్వం, దేశభ క్తి పెంచే సినిమాలు తీసుకురావాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ సూచించారు. గురువారం రవీంద్రభారతిలో ‘సృజన సాంస్కృతిక- సాహితీ’ సంస్థ రజతోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలు, సీరియళ్లు మన సంస్కృతిని, సంప్రదాయాలను నిలబెట్టేవిగా, సామాజిక బాధ్యతను గుర్తు చేసేవిగా ఉండాలని తెలిపారు.  
     
    కళలను ప్రోత్సహించాలి..

    సిక్కిం పూర్వ గవర్నర్ వి. రామారావు మాట్లాడుతూ ప్రశాంత జీవనం సాగించేందుకు ఉపయోగపడే కళలను అందరూ ప్రోత్సహించాలని పేర్కొన్నారు. డీజీపీ బి. ప్రసాదరావు మాట్లాడుతూ కళల ద్వారానే ప్రాచీన సంస్కృతిని భావితరాలను అందించే వీలుకలుగుతుందని వెల్లడించారు. ‘సృజన’ సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అంజనా చౌదరి మాట్లాడుతూ కళా రంగానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 25 సంవత్సరాల క్రితం సృజనను స్థాపించామని చెప్పారు.  

    అనంతరం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి. రామానాయుడుకు జీవన సాఫల్య పురస్కారాన్ని, ప్రముఖ  వైద్యులు ఎస్. విజయరామారావు, సినీ దర్శకులు కోడి రామకృష్ణ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ ఆచార్య పి. పద్మావతి, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, డాక్టర్ శోభారాజులకు సృజన గౌరవ పురస్కారాలను జస్టిస్ చంద్రకుమార్, డీజీపీ ప్రసాదరావులు అందజేశారు.

    అతి థులను నిర్వాహకులు సన్మానించారు. సభకు ముందు రమ్యతేజ పుంజల ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆక ట్టుకుంది. కార్యక్రమంలో ప్రసాద్ ఐమాక్స్ చైర్మన్ ఎ. రమేష్ ప్రసాద్, సృజన సంస్థ ఉపాధ్యక్షులు మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.    

>
మరిన్ని వార్తలు