హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం

24 Oct, 2019 08:00 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : కాంగ్రెస్‌ కంచుకోట హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా రెపరెపలాడింది. తాజాగా జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి 43,624 రికార్డు మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్‌రెడ్డిపై రికార్డు విజయం సాధించారు. తొలి నుంచి చివరి వరకు  అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మారెడ్డి ఒక్క రౌండ్‌లోనూ ఆధిక్యం సాధించకపోవడం విశేషం. ఇక టీడీపీ, బీజేపీల డిపాజిట్‌లు గల్లంతయ్యాయి. 


హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత

  • టీఆర్‌ఎస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన హుజూర్‌ నగర్‌ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అనివార్య కారణాలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలవడం రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన సైదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పార్టీ గెలుపుకు అహర్నిశలు కష్టపడిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాల తెలిపారు. 

  • హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లుండి(శనివారం) హుజూర్‌నగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఓ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి భారీ గెలుపుకు సహకరించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు  

  • ‘కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, టీఆర్‌ఎస్‌కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు’అంటూ కవిత ట్వీట్‌ చేశారు. 

హుజూర్‌నగర్‌ అప్‌డేట్స్‌ :

  • హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ బంపర్‌ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. 16వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి సైదిరెడ్డి 32 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగతున్నారు. ఇప్పటివరకు ఏడు సార్లు జరిగిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఫలితాల్లో.. 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీ నమోదైంది. అయితే తాజాగా సైదిరెడ్డి 15వ రౌండ్‌లోనే ఆ మెజారిటీని అధిగమించాడు. అయితే ఇంకా ఆరు రౌండ్ల కౌంటింగ్‌ మిగిలి ఉండటంతో.. ఆయన మెజారిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
     
  • 16వ రౌండ్‌ ముగిసేసరికి టీఆరెస్ అభ్యర్థి సైదిరెడ్డి 32,256 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా 6 రౌండ్ల కౌంటింగ్‌ జరగాల్సి ఉంది. టీడీపీ డిపాజిట్‌ గల్లంతైంది.జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఓట్ల పరంగా ఆరో స్థానంలో కొనసాగుతోంది.
  • హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ స్పందించనున్నారు. సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
  • హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం దిశగా దూసుకెళ్లడంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలకు హుజూర్‌నగర్‌ ఫలితం చెంపపెట్టలాంటిదని విమర్శించారు. ప్రతిపక్షాలకు టీవీల్లో తప్ప ప్రజల్లో పట్టులేదన్నారు.
  • హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ భారీ మెజరిటీతో దూసుకుపోతుండటంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తెలంగాణ భవన్‌కు చేరుకుని సంబరాల్లో పాల్గొన్నారు.  
  • ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే.. టీడీపీ, బీజేపీలు డిపాజిట్‌లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.
  • రౌండ్‌ రౌండ్‌కు పెరుగుతున్న టీఆర్‌ఎస్‌ మెజారిటీ
  • రాష్ట్రం మొత్తం కేసీఆర్‌ను నమ్ముతుందని అనడానికి హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికే నిదర్శమని సైదిరెడ్డి తెలిపారు. 
  • సైదిరెడ్డి భారీ ఆధిక్యంతో దూసుకుపోవడంతో.. టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

రౌండ్ల వారీగా ఫలితాలు..
మొదటి రౌండ్- టీఆర్‌ఎస్‌ -5583, కాంగ్రెస్-3107, బీజేపీ-128, టీడీపీ-113, టీఆర్‌ఎస్‌ లీడ్- 2476

రెండో రౌండ్- టీఆర్‌ఎస్‌ -4723, కాంగ్రెస్-2851, బీజేపీ-170, టీడీపీ-69, టీఆర్‌ఎస్‌ లీడ్- 1872, రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ లీడ్-4348

మూడో రౌండ్- టీఆర్‌ఎస్‌ -5089, కాంగ్రెస్-2540, బీజేపీ-114, టీడీపీ-86, టీఆర్‌ఎస్‌ లీడ్- 2549, మూడో రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ లీడ్-6897

నాల్గో రౌండ్- టీఆర్‌ఎస్‌ -5144, కాంగ్రెస్-3961, బీజేపీ-102, టీడీపీ-127, టీఆర్‌ఎస్‌ లీడ్- 1183, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ లీడ్-8080

ఐదవ రౌండ్- టీఆర్‌ఎస్‌ -5041, కాంగ్రెస్-3032, బీజేపీ-105, టీడీపీ-57, టీఆర్‌ఎస్‌ లీడ్- 2009, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ లీడ్-10089

అరో రౌండ్- టీఆర్‌ఎస్‌ -5308, కాంగ్రెస్-3478, బీజేపీ-72, టీడీపీ-46, టీఆర్‌ఎస్‌ లీడ్- 1830, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ లీడ్-11919

ఎడో రౌండ్- టీఆర్‌ఎస్‌- 4900, కాంగ్రెస్-3796, బీజేపీ-45, టీడీపీ-46, టీఆర్‌ఎస్‌ లీడ్- 1104, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ లీడ్-13023

మరిన్ని వార్తలు