మళ్లీ టాప్‌-10లో హెచ్‌సీయూ 

23 Oct, 2019 08:49 IST|Sakshi

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. క్యూఎస్‌ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌–2020లో హెచ్‌సీయూ వరుసగా రెండోసారి టాప్‌టెన్‌ జాబితాలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌ జాబితాలో మొదటి స్థానంలో ఐఐటీ–బాంబే, ఐఐఎస్‌సీ–బెంగళూరు రెండోస్థానం, ఐఐటీ–ఢిల్లీ–మూడోస్థానం పొందగా హెచ్‌సీయూ 8వ స్థానం సాధించింది. దేశంలోని వంద విద్యాసంస్థలను పరిశీలించి ర్యాంకింగ్స్‌ ఇచ్చారు. స్టాఫ్‌ విత్‌ పీహెచ్‌డీ కేటగిరీలో బెస్ట్‌ స్కోర్‌ ఇండికేటర్‌ను హెచ్‌సీయూ సాధించడం మరో విశేషం. ఈ ర్యాంకింగ్స్‌లో ముఖ్యంగా ఫ్యాకల్టీ–స్టూడెంట్స్‌లో 26.9 పాయింట్లు, సిటేషన్స్‌ ఫర్‌ ఫ్యాకల్టీ 40.5, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ 3.4, ఇంటర్నేషనల్‌ ఫ్యాకల్టీ 2.5, ఎంప్లాయర్‌ రెప్యూటేషన్‌ 5.3, అకాడమిక్‌ రెప్యూటేషన్‌లో 10.8 పాయింట్లు సాధించింది. వీటి ఆధారంగానే ర్యాంకింగ్స్‌ను ఖరారు చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు