చిన్నారికి సీపీ బర్త్‌డే విషెస్‌

29 Apr, 2020 08:56 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: ఓ చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకను హైదరాబాద్‌ పోలీసులు ఘనంగా నిర్వహించారు. తన పుట్టిన రోజు వేడుకలకు విచ్చేసిన పోలీసులను చూసిన చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లతో ఆకట్టుకున్న సంఘటన మంగళవారం బర్కత్‌పురాలో చోటు చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన సందీప్, హరిణిలు నవంబర్‌లో అమెరికా వెళ్లారు. వీళ్లిద్దరికీ ఏడాది పాప ఉంది. పేరు మైరా. మైరా మొదటి పుట్టినరోజు కావడంతో తల్లిదండ్రులు ఇద్దరూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు మంగళవారం ఉదయం ఫోన్‌లో ఈ విషయం చెప్పారు. దీంతో బర్కత్‌ పురాలోని నాయనమ్మ రామా, తాతయ్య రాంరెడ్డి నివాసానికి విచ్చేసిన అంజనీకుమార్‌ జాయింట్‌ సీపీలు విశ్వప్రసాద్, రమేష్, ఏసీపీలు భిక్షం రెడ్డి, సుధాకర్ల సమక్షంలో మైరాకి బర్త్‌ డే విషెస్‌ చెప్పి... తెడ్డిబేర్, బెలూన్స్‌ ఇచ్చారు. గిఫ్టుగా ఇచ్చినా తెడ్డిబేర్‌ మాస్క్‌ ఉండటం విశేషం అనిపించింది.

మరిన్ని వార్తలు