దిశ కేసు: ఆరోజు పూర్తి వివరాలు తీసుకోలేదు!

2 Dec, 2019 13:31 IST|Sakshi

సాక్షి, షాద్‌నగర్‌: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్‌ కోర్టు విచారణ చేపట్టింది. నిందితులను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో పోలీసులు షాద్‌నగర్‌ కోర్టుకు చేరుకున్నారు. 784 / 2019 క్రైమ్ నెంబరులో నిందితులను విచారించాలని పోలీసులు పిటిషన్‌లో కోరారు. అదే విధంగా ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని పేర్కొన్నారు. విచారణలో భాగంగా... నిందితుల దగ్గర నుంచి మరింత సమాచారం తెలుసు కోవాల్సిఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దిశ కేసులో నిందితులను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించే రోజు వేలాది మంది పోలీస్ స్టేషనుకు చేరుకోవడంతో నిందితుల నుంచి పూర్తి వివరాలు తీసుకోలేదని తెలిపారు. కాబట్టి పది రోజులు కస్టడీకి అనుమతి ఇస్తే వారిని మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. ఘటనలో మిస్సయిన మొబైల్ ఫోన్ రికవరీ చేయాల్సి ఉందని.. అదే విధంగా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చెయ్యాల్సి ఉందని పిటిషన్‌లో వెల్లడించారు.

కాగా కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో నిందితుల కస్టడీపై కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది. ఇదిలా ఉండగా... కోర్టు వద్ద న్యాయవాదులంతా దిశకు మద్దతు తెలిపారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌లో ఏ న్యాయవాది కూడా నిందితులకు న్యాయ సహాయం చేయకూడదని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఫర్ దిశకు ప్రతి ఒక్క న్యాయవాది మద్దతు ఇవ్వాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘దిశ’ కేసులో అన్నీ జాప్యాలే!

అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ భారీ బాదుడు..!

ఈ అడ్డాల వద్ద జర భద్రం బిడ్డా..!

తొండుపల్లి టోల్‌గేటు వద్ద సీసీ కెమెరాలు

ఆ.. ఘోరం జరిగింది ఇక్కడేనా!

కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి

నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు

ఇందూరు బిడ్డ.. బాక్సింగ్‌ బాదుషా!

వేదమంత్రాల సాక్షిగా.. ఒక్కటైన 165 జంటలు

‘ఆ కొడుకులు ఉన్నా ఒకటే.. పోయినా ఒక్కటే’

శవాలకూ రక్షణ కరువు

ఫిజిక్‌ ఫేమ్‌... ట్రాన్స్‌ఫార్మ్‌! 

అత్యాచారానికి ఉరిశిక్షే సరి!

సానుభూతి వద్దు.. న్యాయం చేయండి

10న ఆటోలు బంద్‌: ఆటోడ్రైవర్స్‌ జేఏసీ

సత్వర న్యాయం అందేలా చూస్తాం

‘దిశ’ నిందితుల వీడియోల లీక్‌పై దర్యాప్తు ?

దిశ నిందితులకు సండే స్పెషల్‌

జస్టిస్‌ ఫర్‌ దిశ హత్య: టెక్నికల్‌ డేటాది కీలక పాత్ర...

100 టీఎంసీలు కావాలి

ప్రతి జిల్లాకు ఓ స్టడీ సర్కిల్‌! 

విద్యతోనే గొల్ల, కురుమల అభివృద్ధి 

కందికట్కూర్‌కు ‘లీకేజీ’ భయం

ఒక్క స్లాట్‌లోనే 53 మందికి ప్లేస్‌మెంట్స్‌ 

నేటి నుంచి ‘నీట్‌’ దరఖాస్తులు 

హైదరాబాద్‌ను బ్రాందీ నగరంగా మార్చారు

వేతన సవరణ ఏడాది తర్వాతే..

‘ఓడీ’.. కార్మిక సంఘాల్లో వేడి

జస్టిస్‌ ఫర్‌ దిశ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘శ్రీదేవి : ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’

జనవరి 31న ‘నిశ్శబ్దం’గా..

భార్యను కొట్టిన నటుడు అరెస్ట్‌  

మథనం విభిన్నంగా ఉంది

మిస్‌ మ్యాచ్‌ హిట్‌ అవుతుంది

రీసౌండ్‌