పారాచూట్‌ తెరుచుకోక..

11 Aug, 2019 01:14 IST|Sakshi
విహారయాత్రలో మృతి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (పైల్‌ఫోటో)

కులూమనాలిలో ప్రమాదం.. నగరానికి చెందిన వైద్యుడు మృతి 

విహారయాత్రలో విషాదం.... 

నగరంలోని మోహన్‌నగర్‌లో విషాదఛాయలు 

హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ వైద్యుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూమనాలి విహారయాత్రకు వెళ్లి అక్కడ మృతి చెందారు. దీంతో కొత్తపేట డివిజన్‌ మోహన్‌నగర్‌ పరిధిలోని సమతాపురి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్క వేమారెడ్డి–లక్ష్మిల దంపతుల చిన్న కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(24) నగరంలోని ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

సమతాపురి కాలనీకి చెందిన స్నేహితులు విశాల్, అఖిల్‌తో కలసి హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూమనాలికి బుధవారం వెళ్లారు. శనివారం విహార యాత్రలో రోప్‌వేలో ప్రయాణిస్తుండగా వైర్లు తెగిపడ్డాయి. దీంతో పారాచూట్‌ సహాయంతో కిందికి దిగేందుకు ప్రయత్నించగా అది సరిగ్గా తెరుచుకోకపోవడంతో కిందపడి పోయారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా మాట్లాడించి మృత దేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  

మరిన్ని వార్తలు