నాచారం ప్రాంతంలో తనిఖీలు.. రూ. 3 కోట్లు రికవరీ

19 Jan, 2019 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జీఎస్టీ అధికారులు దూకుడు పెంచారు. షెల్‌ కంపెనీల ద్వారా లబ్ధి పొందుతున్న వ్యాపారుల పని పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం అధికారులు 500 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న ఓ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వ్యాపార సంస్థ యజమాని ఇంటితో పాటు కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో శంకరంపేట, నాచారం యూనిట్లలో భారీ అక్రమాలు బయటపడ్డాయి. మూడు డొల్ల కంపెనీల ద్వారా సుమారు 40 కోట్ల రూపాయల మేర ఇన్‌వాయిసెస్‌లు జారీ చేసినట్లు గుర్తించారు.

ఈ నకిలీ ఇన్‌వాయిసెస్‌ల వల్ల ప్రభుత్వానికి రూ. 4 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు అధికారులు. ప్రస్తుతం  సదరు సంస్థ యజమానిని అరెస్ట్‌ చేయడమే కాక రూ. 3 కోట్ల రూపాయలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లోగా మిగతా కోటి రూపాయలు చెల్లించే విధంగా యజమాని నుంచి పూచీకత్తు తీసుకున్నారు. ఇవే కాక ఇతర అనేక రంగాలలో పన్ను ఎగవేతదారుపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించారు.

మరిన్ని వార్తలు