కాలుష్యంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌

12 Jul, 2019 17:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో రోజు రోజుకీ పెరుగిపోతున్నకాలుష్యంపై కాలుష్య నియంత్రణ సంస్థ, జీహేచ్‌ఎంసీతో పాటు 13 విభాగాలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారిచేసింది. హైదరాబాద్‌లో విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యంపై న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డుకు, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, జీహేచ్ఎంసీతో పాటు 13 విభాగాలకు నోటీసులు జారీ చేసింది. కాలుష్యంపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం నోటీసుల్లో పెర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు