లాక్‌డౌన్‌ ఎత్తివేత: ఐటీ కంపెనీల కొత్త నిబంధనలు

27 Apr, 2020 12:32 IST|Sakshi

కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ మే 3వ తేదితో పూర్తి అవుతున్న నేపథ్యంలో అసలు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా లేదా కొనసాగిస్తారా అన్న విషయం చర్చనీయాంశమైంది. అయితే మే3 తర్వత లాక్‌డౌన్‌ పాక్షికంగా ఎత్తివేస్తే ఐటీ కంపెనీలు తిరిగి తెరుచుకోడానికి సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడంపై ప్రభుత్వ ఇచ్చే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తూ. కంపెనీలు పునఃప్రారంభించాలని యోచిస్తున్నాయి. అంతేగాక కోవిడ్‌-19ను అరికట్టడానికి కొత్తగా తమ సొంత నిబంధనలను కూడా తీసుకురాబోతున్నాయి.
(లాక్‌డౌన్‌ కొనసాగింపునకే మోదీ మొగ్గు..! )

ఇక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి పనిచేయడానికి అనుమతించే క్రమంలో చాలా వరకు సంస్థలు భౌతిక దూరం కొనసాగించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ అనంతరం భౌతిక దూరం పాటిస్తూ తమ కార్యాలయాలు ఎలా సిద్ధమవుతున్నాయో తెలియజేయడానికి టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గున్నాని ట్విటర్‌లో కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. వీటిలో ఆఫీస్‌ ముఖద్వారాలు, లిఫ్ట్‌లు, బాత్‌రూమ్‌ల వద్ద గీసిన మార్కులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. అదే విధంగా విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా తమ కార్యాలయాల్లో అనుసరిస్తున్న భౌతిక దూర నిబంధనలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. (జూలై 25 నాటికి కరోనా నుంచి భారత్‌కు‌ విముక్తి! )

మే 3 తర్వాత లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తివేసిన తర్వాత బహుళ జాతీయ సంస్థలు మాత్రమే కాకుండా చిన్న ఐటి కంపెనీలు కూడా ఈ చర్యలపై దృష్టి సారిస్తున్నాయి. టెంపరేచర్‌ స్క్రీనింగ్ లాంటి సాధారణ జాగ్రత్త చర్యలే కాకండా.. శానిటైజర్‌లను డెస్క్‌లపై ఉంచడం, ఉద్యోగుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రత  వంటి ముందు జాగ్రత్త చర్యలపై కసరత్తు చేస్తున​ఆనయి. కాగా భౌతిక దూరంపై హైదరాబాద్‌లోని కొన్ని ఐటి కంపెనీలు అనుసరిస్తున్న కొత్త  నిబంధనలను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణ యేదుల పేర్కొన్నారు. అవి

► కార్యాలయ ప్రవేశ ద్వారం, యాక్సెస్‌ కార్డ్‌ స్క్రీనింగ్‌ వద్ద  రెండు అడుగుల దూరం పాటించడం. 
► లిఫ్టులో కేవలం 50శాతం మాత్రమే అనుమతించడం.
► క్యాబ్‌కు ఒక వ్యక్తి మాత్రమే అనుమతించడం....... అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం ప్రభుత్వం జారీచేసే నిబంధనలపై కంపెనీలు ఆధారపడి పనిచేయాల్సి ఉంటుందని కృష్ణ యేదుల పేర్కొన్నారు.
(ఆ దేశంలో భారతీయుల మరణాలు ఎక్కువ! )

>
మరిన్ని వార్తలు