‘నెబ్యులా’తో స్మార్ట్‌ జర్నీ..

16 Nov, 2017 14:36 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మెట్రో రైలు ప్రయాణాన్ని ‘స్మార్ట్‌’ చేస్తున్నారు. టిక్కెట్ల గోల లేకుండా మెట్రో స్మార్ట్‌ కార్డు ‘నెబ్యులా’ను తీసుకొస్తున్నారు. దీని ధర రూ.100, మరో రూ.100తో రీచార్జి చేసుకోవాలి. అంతేకాదు గరిష్టంగా రూ.2 వేల వరకు రీచార్జి చేసుకోవచ్చు. ఈ కార్డులను ఈనెల మూడో వారం నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌ విక్రయాలకు త్వరలో వెబ్‌సైట్‌ను ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రారంభించనుంది.

మనం బయలుదేరే స్టేషన్‌ మొదటి అంతస్తులోని ‘ఆటోమేటిక్‌ ఫెయిర్‌ కలెక్షన్‌’ గేటు వద్ద ఈ కార్డును స్వైప్‌ చేయాలి. రైలు దిగాక స్టేషన్‌లోని ఎగ్జిట్‌ గేటు వద్ద మరోమారు స్వైప్‌ చేస్తే చాలు.. ప్రయాణించిన దూరానికి అయిన చార్జీ కార్డు నుంచే కట్‌ అవుతుంది. భవిష్యత్‌లో ఈ కార్డుతో ఆర్టీసీ, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, మెట్రోమాల్స్, స్టేషన్లలో షాపింగ్‌.. ఇలా 16 రకాల సేవలు పొందే అవకాశముంది. కాగా మెట్రో కనిష్ట టిక్కెట్‌ ధర రూ.10, గరిష్టంగా రూ.50 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు