ఇక రాత్రి 11 గంటల వరకు మెట్రో

15 Dec, 2019 02:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వ రకు నడువనున్నాయి. నగరంలో సుమారు 1000 సిటీ బస్సులను ఆర్టీసీ రద్దు చేస్తున్న నేపథ్యంలో మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇక నుంచి అన్ని టెర్మినళ్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆఖరు స్టేషన్‌ కు 11.50 గంటలకు చేరుకుంటాయి. అలాగే ఉదయం 6 గంట లకు బదులుగా 6.30 గంటలకు మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా