ఓయోతో ఇంటి యజమానులకు ఆదాయం

6 Nov, 2019 07:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పర్యాటకులకు విభిన్న రకాల బస సదుపాయాలను అందించే ఆన్‌లైన్‌ ఆధారిత సంస్థ ఓయో నగరంలోని భవన యజమానులకు ఆదాయవనరుగా మారిందని ఓయో ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.  నగరవాసి ఐటి ఉద్యోగి అరవింద్‌ తన 30 ఏళ్ల నాటి భవనాన్ని ‘ఓయో 15141 టౌన్‌విల్లా గెస్ట్‌ హౌజ్‌’గా మార్చడం ద్వారా హోటల్‌ పరిశ్రమకు పరిచయం అవడంతో పాటు అనూహ్యమైన ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. అలాగే మహ్మద్‌ హబీబ్‌ మొయినుద్దీన్‌ కూడా తన నివాసాన్ని స్పాట్‌ ఆన్‌ 47525 డెక్కన్‌ లాడ్జ్‌గా మార్చి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటున్నారు. ఇలాగే మరెందరో ఓయోతో ప్రయోజనం పొందారని వివరించారు. 

‘మాస్టర్‌ క్లాసెస్‌’ టూర్‌
ప్రస్తుతం హైస్కూల్‌ విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో మెడిసిన్‌ చదవాలని ఆశిస్తున్న విద్యార్థుల కోసం వెస్టిండీస్‌కు చెందిన జారŠజ్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ దేశవ్యాప్తంగా ‘మాస్టర్‌ క్లాసెస్‌ ఫర్‌ హైస్కూలర్స్‌’ టూర్‌ నిర్వహిస్తోంది. నగరంలోని శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నుంచి ఈ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుందని నిర్వాహక సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంతో పాటు బెంగుళూరు, ముంబయి, ఢిల్లీలోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. నగరంలో ఈ టూర్‌కి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌ డా.కేశవకుమార్‌ మందలనేని శ్రీకారం చుట్టారని వివరించారు.   

మరిన్ని వార్తలు