-

మహాగణాధ్యక్షాయ..

2 Sep, 2019 09:10 IST|Sakshi
శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి

గణేశ్‌ నవరాత్రి వేడుకలకు నగరం సిద్ధం

శ్రీ ద్వాదశాదిత్య రూపుడిగా ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనం

చరిత్రలోనే తొలిసారిగా 61 అడుగుల ఎత్తులో విగ్రహం ఏర్పాటు

తొలిపూజలో పాల్గొననున్న గవర్నర్‌ నరసింహన్‌

ఖైరతాబాద్‌:  గణేశ్‌ నవరాత్రి వేడుకలకు నగరం సిద్ధమైంది. సోమవారం నుంచి 9 రోజులపాటు సందడి చేయనున్న గణనాథులు అందమైన మండపాల్లో కొలువుదీరారు.ఇక ఈసారి ఖైరతాబాద్‌ మహాగణపతి శ్రీ ద్వాదశాదిత్య రూపుడిగా దర్శనమివ్వనున్నాడు. చరిత్రలోనే మొదటిసారిగా 61అడుగుల ఎత్తులో....12 ముఖాలు...24 చేతులతో సూర్యభగవానుడి రథంపైనిలబడిన ఆకారంలో భక్తులకుదర్శనమిచ్చేందుకు మహాగణపతిసిద్ధమయ్యాడు. 65వ సంవత్సరంసందర్భంగా అత్యంత అద్భుతంగా..శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ రూపొందించినఖైరతాబాద్‌ మహాగణపతికి వినాయక చవితి సందర్భంగా తొలిరోజు సోమవారం

పూజా విశేషాలు ఇవీ...
ఉదయం 5 గంటలకు గణపతి హోమం
ఉదయం 6 గంటలకు75 అడుగుల కండువా, 75 అడుగుల జంధ్యం, 75 అడుగుల గరికమాల ఊరేగింపుగా ఖైరతాబాద్‌ మండపానికి రాక.  
ఉదయం 7–8 గంటల మధ్య మహాగణపతికి పూజా కార్యక్రమం...కండువా, జంధ్యం, గరికమాల అలంకరణ.  
ఉదయం 10–11 గంటల మధ్య లంగర్‌హౌస్‌ నుంచి ప్రత్యేకంగా తయారుచేసిన 750 కిలోల లడ్డూ సమర్పణ.  
మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతికి గవర్నర్‌ నరసింహన్‌దంపతుల తొలిపూజ.
సాయంత్రం 6 గంటలకు కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఈటలరాజేందర్‌ రాక. 

ప్రత్యేక పూల అలంకరణ.....
ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలిపూజకోసం ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా 300 కిలోల పసుపు బంతి, 300 కిలోల ఎరుపు బంతి, 100 కిలోల చామంతి, 30 అరటి చెట్లు ఉపయోగించి మాలలు తయారు చేశారు. ఒక్కో మాల 80 అడుగుల పొడవు ఉంటుంది.

మరిన్ని వార్తలు