ఎన్సీఎల్టీలో రవిప్రకాష్‌కు చుక్కెదురు!

24 May, 2019 20:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ మరింత చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ముందుస్తు బెయిల్‌ కోసం వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయగా.. తాజగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ)లో చుక్కెదురైంది. ఎన్సీఎల్టీలో ఏబీసీఎల్‌కు వ్యతిరేకంగా సైఫ్‌ మరిషస్‌ కంపెనీ వేసిన పిటిషన్‌ను అడ్డుపెట్టుకుని టీవీ9 యాజమన్య బదిలీని అడ్డుకోవాలని రవిప్రకాశ్‌ ప్రయత్నించారు. అయితే రెండు కంపెనీల మధ్య వివాదం ముగిసి సయోద్య కుదరడంతో ఏబీసీఎల్‌పై మారిషస్‌ కంపెనీ వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాడాన్ని ఎన్సీఎల్టీ కూడా ఆమోదించింది. దీంతో రవిప్రకాశ్‌ పన్నిన వ్యూహానికి బ్రేక్‌ పడింది. అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్‌ పోలీసులు ఇచ్చిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులకు స్పందించలేదు. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. రవిప్రకాష్‌ జాడకోసం సైబర్‌క్రైం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ఓ వీడియో సందేశం ద్వారా టీవీ9 నూతన యాజమాన్యంపై  తీవ్ర ఆరోపణలు చేసిన రవిప్రకాశ్‌.. ఎన్సీఎల్టీలో కేసు నడుస్తుండగా తనపై పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారన్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు