ఆ రోజు ర్యాలీలు బంద్‌

21 May, 2019 07:11 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తదితరులు

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం నగరంలో నిషేధాజ్ఞలు విధించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధిస్తూ సీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకూడదు. విజయోత్సవ ర్యాలీలను పూర్తిగా నిషేధించారు. మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లతో పాటు మిలటరీ క్యాంటీన్లు, స్టార్‌ హోటళ్లలోని బార్లకూ ఇది వర్తించనుంది. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, బహిరంగ ప్రదేశాల్లో క్రాకర్లు కాల్చొద్దని, డీజేలతో పాటు పరిమితికి మించి శబ్ధం చేసే వాటిని వినియోగించొద్దని కొత్వాల్‌ స్పష్టం చేశారు.ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్‌...
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తు ఏర్పాట్లపై కొత్వాల్‌ అంజనీకుమార్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(సీసీసీ)లో జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర, నగర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని, బెట్టింగ్‌ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని సిటీ పోలీసు బాస్‌ అధికారులను ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరి సాగు అస్సలొద్దు..

గళమెత్తారు.. 

మా వాళ్లను విడిపించరూ..!

బట్టలూడదీసి పబ్‌ డ్యాన్సర్‌ను కొట్టారు..!

ప్రజల్లో అవగాహన పెరగాలి 

మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి 

‘నీట్‌’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల

సికింద్రాబాద్‌ టు నాగ్‌పూర్‌... సెమీ హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే!

నైరుతి ఆలస్యం.. తగ్గనున్న వర్షపాతం

సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..!

18న ఐఆర్‌ ప్రకటన!

టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం

సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ 

ఈ సినిమా ఎంతో హృద్యంగా ఉంది : కేటీఆర్‌

రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆ పేపర్‌పై ఎందుకు కేసు పెట్టలేదు: దాసోజు

రూ. 1.88 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

అందని ఆసరా 

బడిబాట షురూ

తహసీల్దార్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

రుణం.. మాఫీ అయ్యేనా!

నర్సింగ్‌ హోంలపై దాడులను అరికట్టాలి

జెడ్పీ కార్యాలయం కోసం అధికారుల వేట

క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి అసభ్యకరంగా..

వేల రూపాయల ఫీజులు కట్టలేని పేదలకు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కలకలం

అభినందన సభలా..

వానమ్మ.. రావమ్మా 

సున్నా విద్యార్థులున్న స్కూల్స్‌126

నానాటికీ ... తీసికట్టు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

లుక్‌ డేట్‌ లాక్‌?

అప్పుడు ఎంత అంటే అంత!

మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది

30న నిర్మాతల మండలి ఎన్నికలు