‘ఫోర్బ్స్’ జాబితాలో నగర సైంటిస్ట్‌

3 Apr, 2019 06:40 IST|Sakshi
ప్రవీణ్‌ కుమార్‌

సాక్షి,సిటీబ్యూరో: నగరానికి చెందిన యువ శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌ 30 లిస్ట్‌లో చోటు దక్కింది. కవాడిగూడ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ గోరకవి 16 ఏళ్లుగా వినూత్న పరిశోధనలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. సైన్స్, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఆయన చేసిన పరిశోధనలకు ఫోర్బ్స్‌ ఈ గుర్తింపునిచ్చింది. ఆయన సృజన నుంచి రూపుదిద్దుకున్న ‘ది పై ఫ్యాక్టరీ’ స్టార్టప్‌ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిస్తోంది. ఈ సంస్థ రూపొందించిన లైట్‌ వెయిట్‌ పేపర్‌బోర్డ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆయన రూపొందించిన ప్యాకేజింగ్‌ మెకానిజం, లిక్విడ్‌ జెట్టింగ్‌ మెకానిజం, సాఫ్ట్‌ హ్యాండ్స్, లైట్‌ వెయిట్‌ ప్యాకేజింగ్‌ మెటీరియల్, దోశ ప్రీమిక్స్‌ ఫార్ములేషన్, హోలోగ్రాఫిక్‌ ఇంక్, ఆర్థోపెడిక్‌ క్యాథ్‌టర్, సాచెట్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాసెస్, వాటర్‌ ప్యూరిఫికేషన్‌ డివైజ్, మల్టీ కలర్‌ నెయిల్‌ పెయింటర్, ఆర్టిఫీషియల్‌ లింబ్, లేక్‌వాటర్‌ ప్యూరిఫికేషన్‌ యూనిట్‌ వంటివి పలు అవార్డులను తెచ్చిపెట్టాయి.  ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పటి వరకు ఫ్యాప్సీ అవార్డు, నేషనల్‌ సైన్స్‌ మెడల్, గవర్నర్‌ అప్రిషియేషన్‌ అవార్డు వంటి జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకున్నారు.  

మరిన్ని వార్తలు