గుర్రాల నుంచే కోవిడ్‌ వ్యాక్సిన్‌

20 May, 2020 16:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ పరిశోధకులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనా నిర్మూలన చికిత్సలో భాగంగా.. వ్యాక్సిన్‌ కనుగొనేందుకు యాంటీ బాడీ వ్యవస్ధలతో కూడిన  ఇమ్యునో థెరపీని అభివృధ్దిచేసే యోచనలో ఉన్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు 'సాక్షి'తో తెలిపారు.

'వ్యాక్సిన్‌ సిద్ధం కావడానికి ఆరు నెలలు సమయం పడుతుంది. ప్లాస్మా అనేది కొంతమందికి మాత్రమే అది కూడా ఒకే రక్త గ్రూప్ ఉన్నవారికే పనిచేస్తుంది. గుర్రాల నుంచి సేకరించిన యాంటీ బాడీస్ సమర్ధవంతంగా  పని చేయటంతో పాటు రోగులపై దుష్ప్రభావాలు చూపవు. కావున ఎక్కువ మొత్తంలో  గుర్రం నుంచి రక్తం తీసుకొని అందులో ఉన్న యాంటీ బాడీస్‌తో వ్యాక్సిన్ తయారీ జరుగుతుందని' వీసీ అప్పారావు పేర్కొన్నారు. చదవండి: 'మాస్క్‌లు ధరించకుంటే టికెట్‌ ఇవ్వొద్దు' 

మరిన్ని వార్తలు