'అటెన్షన్‌ ప్లీజ్‌' నగరంలో ట్రాఫిక్‌.. మళ్లింపు మార్గాలు

31 Dec, 2017 20:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సర ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నగరంలోని పలు మార్గాల్లో రద్దీ కారణంగా ట్రాఫిక్‌ను మరల్చారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించారు. ఆదివారం రాత్రి 10:00 గంటల నుంచి సోమవారం ఉదయం 2:00 వరకూ ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. ప్రజలు మార్పులను గమనించాలని పోలీసులు కోరారు.

నెక్లస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్ రోడ్లను పూర్తిగా నిలిపివేశారు.
నెక్టస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్ లోని ట్రాఫిక్‌ను ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌ రోడ్డు మీదుగా దారి మళ్లించారు.
బూర్గుల రామకృష్ణ రావు (బీఆర్‌కే) భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్‌ మినార్‌, లకడీకపూల్‌, అయోధ్యల మీదుగా మల్లించారు.
ఖైరతాబాద్‌ మార్కెట్‌ మీదుగా నెక్లెస్‌ రోటరీవైపు వెళ్లే వాటిని మీనా టాకీస్‌ మీదుగా డైవర్ట్ చేశారు.
మింట్‌ కాంపౌండ్‌ నుంచి సెక్రటేరియట్‌ వెళ్లే రోడ్డును పూర్తిగా నిలిపివేశారు.
నల్లకుంట రైల్వే బ్రిడ్జ్‌ మీదుగా సంజీవయ్యపార్క్‌, నెక్లస్‌ రోడ్‌వైపు వెళ్లేవాటిని మినిస్టర్‌ రోడ్‌ వైపుగా మార్పు చేశారు.
సికింద్రబాద్‌ నుంచి సైలింగ్‌ క్లబ్‌వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌ రోడ్డు, లోయర్‌ ట్యాంక్ బండ్‌, కట్టమైసమ్మ ఆలయం, అశోక్‌ నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డుల పైపు మల్లించారు.
అన్ని ఫ్లైఓవర్లును మూసేశారు.
ప్రైవేటు బస్సులు, లారీలు, పెద్ద వాహనాలను రాత్రి 2:00 గంటల తర్వాతనే సిటీలోకి అనుమతిస్తారు.

మరిన్ని వార్తలు