కొత్తేడాది నాడు మాన‌వ‌త్వం చాటుకున్న యువ‌కులు

1 Jan, 2019 11:16 IST|Sakshi

కొత్త సంవ‌త్స‌రం రోజు అర్ధ‌రాత్రి పేద‌ల‌కు దుప్ప‌ట్లు పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త సంవ‌త్స‌రం పలువురు యువ‌కులు మావ‌న‌త్వం చాటుకున్నారు. న్యూ ఇయర్‌ వేడుక‌ల‌కు ఖ‌ర్చు చేసే డ‌బ్బును సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగించారు. స్వ‌చ్ఛందంగా డ‌బ్బులు వేసుకుని హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట ఒక బృందంగా త‌యారయ్యారు. వారంతా క‌లిసి దుప్ప‌ట్లు పంపిణీ చేసి ఆద‌ర్శంగా నిలిచారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు పాత‌బ‌స్తీలోని మంగ‌ళ్‌హ‌ట్‌, ర‌హీంపుర‌, ఉస్మానియా ఆస్ప‌త్రి, నాంప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో అభాగ్యుల‌కు దుప్ప‌ట్లు పంపిణీ చేశారు. దాదాపు 40 నుంచి 50 దుప్ప‌ట్లు చ‌లికి వ‌ణుకుతున్న పేద‌ల‌కు అంద‌జేశారు. 

ఈ కార్య‌క్ర‌మంలో సాయినాథ్, ఆకాశ్, విష్ణు, పవన్ సింగ్, మహేశ్ రతన్, అజయ్, మహేశ్, రవి త‌దిత‌రులు పాల్గొన్నారు. పేద‌ల‌కు కొంత సేవా చేయాల‌నే భావ‌న‌తో కొత్త సంవ‌త్స‌రం రోజు ఈ కార్య‌క్ర‌మం చేసిన‌ట్లు సాయినాథ్ తెలిపారు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేస్తామ‌ని చెప్పారు.


 

మరిన్ని వార్తలు