తెలంగాణ యాసకు క్రేజ్‌ తెచ్చిన హారిక

30 Jun, 2019 10:10 IST|Sakshi

తెలంగాణ యాసకు క్రేజ్‌ తెచ్చిన హారిక

ఎఫ్‌బీలో ఒక్క పిలుపుతో దివ్య వెంటనడుస్తున్న నెటిజన్లు 

హావభావాల్లో రమ్యవర్మ, సాహినీ, చైతన్య, ప్రియాంకలు సిద్ధహస్తులు 

నేడు వరల్డ్‌ సోషల్‌ మీడియా డే 

ఒకప్పుడు సోషల్‌ మీడియా అంటే గూగుల్, యాహూ వంటివి మాత్రమే. ఆ తర్వాత వచ్చిన ఫేస్‌బుక్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వాడుతుండటం విశేషం. ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్‌ హవా సాగుతోంది. సిటీకి చెందిన కొందరు అమ్మాయిలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. వారు టిక్‌టాక్‌లో చేసిన ఒక్కో వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు అయిదారు గంటల్లోనే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు రావడం విశేషం. నేడు సోషల్‌ మీడియా డే సందర్భంగా సిటీకి చెందిన కొందరు సోషల్‌మీడియా సెలబ్రిటీల అభిప్రాయాలు ఇవీ.. – సాక్షి, సిటీబ్యూరో

యాసకు క్రేజ్‌..  
ఈమె పేరు హారిక అలేఖ్య. తెలంగాణ యాసలో హారిక చెప్పే డెలాగ్‌లు సోషల్‌ మీడియాలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో సైతం హల్‌చల్‌ చేస్తుంటాయి. ఈమె ప్రాతినిధ్యం వహించే ‘దేత్తడి’ యూట్యూబ్‌ చానెల్‌కు ప్రస్తుతం 8లక్షల 70వేల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. త్వరలో ఈ సంఖ్య పది లక్షలకు చేరనుంది. ఈ మార్క్‌ను అధిగమిస్తే తెలుగులో ‘దేత్తడి’ రికార్డు సృష్టించనుంది. ఈమె పర్సనల్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 2.50 లక్షలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ‘దేత్తడి’ చానల్‌లో ఈమె నటించిన వీడియోలు బిట్స్‌గా సోషల్‌ మీడియా వేదికగా ఫుల్‌ వైరల్‌ కావడం విశేషం. అతి తక్కువ కాలంలో తనదైన శైలిలో డైలాగులు చెప్పడం.. హావభావాలు పలికించడం ఈమెకు ఈమే సాటి. తెలంగాణ యాసలో నటించిన ‘కూల్‌ డైరీస్‌ ఫస్ట్‌ లవ్, ఫస్ట్రేట్‌ తెలంగాణ పిల్ల, ఫస్ట్రేటెడ్‌ ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌’ వంటి వీడియోలు వాట్సప్‌ స్టేటస్‌లలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

షీ ఈజ్‌ ఎఫ్‌బీ క్వీన్‌ 
సరదా కోసం ఫేస్‌బుక్‌ లైవ్‌ను ప్రారంభించిన.. దివ్య అన్వేషిత కొమ్మరాజు ఫేస్‌బుక్‌లో 4 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఒక్కసారి ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చి హాయ్‌ అంటూ పలకరిస్తే చాలు నెటిజన్లు ఈమెకు ఇచ్చే కాంప్లిమెంట్స్‌కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎంతో ఆప్యాయతతో, భారతీయ సంస్కృతి ఉట్టిపడే వస్త్రధారణతో లైవ్‌లోకి వచ్చి నెటిజన్లును ఆనందిపజేస్తుంది. కేవలం తన సరదానే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా అందరూ నిలవాలంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఒక్క పిలుపు ఇస్తే చాలు మేమున్నాం అంటూ ఆమె ఫ్యాన్స్‌ నిలబడతారు. గత ఏడాది కేరళలో వరదలు వచ్చినప్పుడు ఫేస్‌బుక్‌ వేదికగా దివ్య అన్వేషిత విరాళాలు సేకరించగా..రూ.5లక్షలకు పైగా పేటీఎం, గూగుల్‌ ప్లే, బ్యాంకు ఎకౌంట్‌ల ద్వారా అక్కడి ప్రభుత్వానికి అందాయి.  

కళ్లతో కట్టిపడేస్తది    
ఈమె పేరు రమ్యవర్మ. 2014లో సరదాగా ఈ వీడియో చేసింది. వ్యూస్, లైక్‌లు ఎక్కువ రావడంతో మరిన్ని వీడియోలు చేసేందుకు సంసిద్ధమైంది. ఇప్పటి వరకు చేసిన వీడియోల్లో సమంతకు సంబంధించినవి బాగా ఫేమస్‌ అయ్యాయి. సినిమాల్లో సమంత ఎలా హావభావాలు వ్యక్తపరుస్తుందో.. అదే రీతిలో రమ్యవర్మ వ్యక్తపరచడం విశేషం. వీడియోలు చేసేటప్పుడు కళ్ల కదిలికలు చేస్తున్న తీరు కుర్రకారును కట్టిపడేస్తోంది.  

స్మైలింగ్‌ స్టార్‌ 
ఉప్పల్‌కు చెందిన రౌతు సాహినీరావుకు ప్రస్తుతం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ 50వేల మందికిపైగా ఉన్నారు. లేటెస్ట్‌గా ఏదైనా సినిమాలో డైలాగ్‌ ఫేమస్‌ అయ్యిందంటే చాలు.. క్షణాల్లో ఆ డైలాగ్‌ని టిక్‌టాక్‌ చేసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంది. స్మైల్‌తో చెప్పే డైలాగ్స్‌కి ఈమె ఫాలోవర్స్‌ ఫిదా అవుతుంటారు. ‘మజిలీ’ సినిమాలో సమంత ఫోన్‌లో మాట్లాడే సన్నివేశాన్ని అచ్చుగుద్దినట్లు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో ఈమె ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

ఎక్స్‌ప్రెషన్స్‌లో క్వీన్‌  
ఈమె ‘చైతన్య కల్లూరి’ ప్రస్తుతం టెస్టింగ్‌ ఇంజినీర్‌గా చేస్తోంది. టిక్‌టాక్‌లో సూపర్బ్‌. లేటెస్ట్‌ డైలాగ్స్‌ను తనదైన శైలిలో చేయడంలో ఈమె ఎంతో ఫేమస్‌. నవ్వు, ఏడుపు, బాధ, కన్నీళ్లు ఏదైనా సరే.. ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడంలో ఈమె క్వీన్‌. అందుకే తను ఏ వీడియో చేసినా అభిమానులు ఆ వీడియోను ఫాలో అవుతారు. లైక్‌ కొట్టి కామెంట్‌ రూపంలో తమ అభిమానాన్ని చూపిస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఫాలోవర్స్‌ 60 వేల మందికిపైగా ఉన్నారు. ‘అసలేం గుర్తుకు రాదు’ అనే సాంగ్‌ని చికెన్‌తో చేసింది. ఈ వీడియో వాట్సప్‌లో స్టేటస్‌కి బాగా వాడుకున్నారు.  

అద్భుతాలు సృష్టిస్తూ..  
ప్రియాంక దారపు ఫన్నీ కోసం డబ్‌స్మాష్, వీడియోస్‌ చేయడం హాబీగా ఎంచుకుంది. సినిమాల్లోని, అడ్వర్టయిజ్‌మెంట్స్‌లోని డైలాగ్స్‌ని తనదైన శైలిలో వ్యక్తపరచడంలో దిట్ట. ప్రతి వీడియో స్మైల్‌తో చేస్తుండటంతో ఈమె ఫ్యాన్స్‌ కేరింతలు కొడుతున్నారు.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏటీఎం దొంగలు దొరికారు 

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి...

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

‘గురుకులం’ ఖాళీ!

ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు 

‘ఎస్‌ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

చాలా మంది టచ్‌లో ఉన్నారు..

‘ఆలంబాగ్‌’ ఏమైనట్టు!

ఇంటికే మొక్క

‘క్యాష్‌లెస్‌’ సేవలు

కాంగ్రెస్‌ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్‌ఎస్‌

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

పరిమళించిన మానవత్వం

ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’

ఒకే రోజులో ట్రిపుల్‌ సెంచరీ

ట్రిబుల్‌..ట్రబుల్‌

పెబ్బేరులో మాయలేడి..!

వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌

పూడ్చిన శవాలను కాల్చేందుకు యత్నం 

పల్లె కన్నీరుపెడుతుందో..

చచ్చినా చావే..!

మళ్లీ ‘స్వైన్‌’ సైరన్‌!

కేన్సర్‌ ఔషధాల ధరల తగ్గింపు!

ఎంసెట్‌ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్‌

యాప్‌ టికెట్‌.. టాప్‌

చెరువుల పరిరక్షణకు ముందుకు రావాలి

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం