‘అక్కడ అంగుళం భూమి కూడా లేదు’

11 Jun, 2017 16:19 IST|Sakshi
‘అక్కడ అంగుళం భూమి కూడా లేదు’

హైదరాబాద్‌: శంషాబాద్‌లో భూమి కొన్నాననే వార్తలు అవాస్తవమని రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. తనకు శంషాబాద్‌లో అంగుళం భూమి కూడా లేదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. 2013 కాంగ్రెస్ పార్టీ హయాంలోనే భూములు తీసుకున్నాం.. కొత్తగా భూమి కొనుగోలు చేయలేదని చెప్పారు. అన్నీ పరిశీలించిన తర్వాతే భూమి కొన్నామని, రైట్ రాయల్ వేలోనే కొనుగోలు చేశామని వివరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కుమార్తె కలిసి శంషాబాద్‌లో దిగిన ఫోటో చూసి భూమి కొన్నట్లు ఆరోపించడాన్ని ఆయన ఖండించారు.

శంషాబాద్‌లో ఒక్క ఇంచ్‌ భూమి కూడా లేదని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడే ఇబ్రహీంపట్నంలో తన పిల్లల పేరున భూమి కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. అన్ని వెరిఫై చేసుకున్నాకే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నామన్నారు. తనకు వేరే భూములు లేవని తెలిపారు. ప్రభుత్వ అధికారాలు ఉపయోగించుకుని స్థలాలు కొనలేదని కేశవరావు చెప్పారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.