కేసీఆర్‌కు అఖిలేష్‌ అభినందనలు

26 Dec, 2018 16:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ మధ్య బుధవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. జనవరి 7 తరువాత కేసీఆర్‌ను హైదరాబాద్‌లోనే కలుస్తానని అఖిలేష్‌ తెలిపారు. డిసెంబర్‌ 25, 26 తేదిల్లో ఆయనను కలవాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కలవలేకపోయ్యానని అన్నారు. గత కొన్ని రోజులుగా అన్ని పార్టీలు కలిసి పని చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని, కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నం చేయడం అభినందనీయం అన్నారు. ఫెడరల్‌ ఫ్రెండ్‌ దిశగా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, ఆయనను కలిసి ఫ్రెంట్‌పై మరింత చర్చిస్తానని అఖిలేష్‌ పేర్కొన్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం వివిధ రాజకీయ పార్టీల నేతలతో కేసీఆర్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవల ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేష్‌ను కలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పలు కారణాల వల్ల తాను ఢిల్లీ వెళ్లలేకపోతున్నానని,  త్వరలోనే కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలుస్తానని అఖిలేష్‌ వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు