ఈఎస్‌ఐసీ ఆసుపత్రికి ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి

9 May, 2020 04:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పరిశీలనలో అపోలో, ఏఐజీ ఆసుపత్రులు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగులపై ప్లాస్మా ట్రయల్స్‌ చేసేందుకు గాంధీ ఆసుపత్రితోపాటు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌కు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శుక్రవారం అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 113 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 28 ఆసుపత్రులకు అనుమతి ఇచ్చారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో రెండింటికి అనుమతి వచ్చింది. ప్రస్తుతం ఈఎస్‌ఐసీలో కరోనా చికిత్సలు చేయడం లేదు. ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా కరోనా చికిత్స ప్రారంభించే అవకాశముంది. 

అలాగే గుజరాత్‌లో 5, రాజస్తాన్‌లో 4, పంజాబ్‌లో ఒకటి, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 4, మధ్యప్రదేశ్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, కర్ణాటక, చండీగఢ్‌లో ఒక్కో ఆసుపత్రికి అనుమతి ఇచ్చారు. మరో 83 ఆసుపత్రుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దరఖాస్తుల పరిశీలనలో హైదరాబాద్‌లోని అపోలో, ఏఐజీ ఆసుపత్రులు కూడా ఉన్నాయని ఐసీఎంఆర్‌ తెలిపింది.
(చదవండి: తెలంగాణలో మరో 10 పాజిటివ్‌ )

మరిన్ని వార్తలు