రేపట్నుంచి ప్రైవేటులో పరీక్షలు

7 Jul, 2020 07:47 IST|Sakshi

పునఃప్రారంభిస్తామంటున్న యాజమాన్యాలు

ఇప్పటివరకు చేసిన పరీక్షలు ఐసీఎంఆర్‌లో నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతించిన ప్రైవేటు లేబొరేటరీ లు, వివిధ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో ప్రభుత్వ ఆదేశాలతో నిలిచిన కరోనా నిర్ధారణ పరీక్షలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని లేబొరేటరీలు నిబంధనలకు విరుద్ధంగా కరోనా పరీక్షలు చేయడం, మరి కొన్ని చోట్ల లక్షణాలు లేకున్నా పరీక్షలు నిర్వహించడం, ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో పరీక్షల వివరాలను అప్‌లోడ్‌ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం లోపాలున్న వాటికి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు కొన్ని లేబొరేటరీలు వివరణ ఇచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు నిబంధనలను పాటిస్తూ తిరిగి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు కొన్ని లాబ్‌ల యాజమాన్యాలు తెలిపాయి. ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో ఇప్పటివరకు చేసి న పరీక్షల వివరాల్ని నమోదు చేసే ప్ర క్రియ పూర్తి కావొచ్చిందని వివరించాయి.

విన్నపాల వెల్లువ
కరోనా కేసులు రోజు రోజుకూ విజృంభిస్తున్నాయి. రోజూ దాదా పు 2 వేల వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేయించుకోవాలంటే అక్కడ టెస్టుల సామర్థ్యం పూర్తిస్థాయిలో లేదన్న భావన ప్రజల్లో నెలకొంది. మరోవైపు ప్రైవేటులో చేయించకుందామంటే వారం రోజులుగా వాటిల్లో పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది కరోనా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరైతే పక్క రాష్ట్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని వస్తున్నారు. కరోనా లక్షణాలు, అనుమానాలున్న వా రంతా తక్షణమే పరీక్షలు చేయాలని విన్నవిస్తున్నారని లాబ్‌ల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పక్కాగా ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు లేబొరేటరీల వర్గాలు వెల్లడించాయి.

జర్మనీ కిట్లు వాడుతున్నాం
మేం నాణ్యమైన కిట్లతోనే  పరీక్షలు చేస్తున్నాం. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ కిట్స్‌ వాడుతున్నాం. నిర్ధారణ పరీక్షల్లో ఎక్కడా రాజీ పడట్లేదు. వైరస్‌ విజృంభణ సమయంలో వ్యాపార కోణంలో ఆలోచించట్లేదు. పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చా క 12 వేల మందికి పరీక్షలు చేశాం. వాటిల్లో పాజి టివ్‌ వచ్చిన వారి రిపోర్టులను తక్షణ వైద్యం కో సం వేగంగా అందజేశాం. వాటన్నింటినీ ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడంలో కొం త ఆలస్యం జరిగింది. అందుకే కొంత విరామం తీసుకొని వాటన్నింటినీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాం. రోజూ ఉదయం 9 నుంచి రా త్రి 11 వరకు ఫలితాల అప్‌లోడ్‌కు సమయం కేటా యిస్తూ పనిచేస్తున్నాం. ఈ పని మంగళవారం ము గించి బుధవారం నుంచి కరోనా పరీక్షలు చేస్తాం. ఎంత మందికైనా పరీక్షలు చేయగలం.– సుప్రితారెడ్డి, ఎండీ, విజయ డయాగ్నస్టిక్స్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు