కరోనా చికిత్సకు ‘ఐకో వెంట్‌’ వెంటిలేటర్‌

22 Apr, 2020 04:13 IST|Sakshi

పూర్తిగా దేశీయ టెక్నాలజీతో రూపకల్పన

మరో మూడు వారాల్లో అందుబాటులోకి..

వివరాలు వెల్లడించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగుల కోసమే దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన వెంటిలేటర్‌.. ‘ఐకో వెంట్‌’ పేరుతో మార్కెట్‌లోకి రానుంది. అందుబాటులో ఉన్న పరికరాలు, తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ వెంటిలేటర్‌ కరోనా బారినపడిన రోగులపై బాగా పనిచేస్తుందని దీని రూపకర్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన దీని పనితీరు, ప్రత్యేకతలను మీడియా కు వివరించారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదని, తమ ఐకో వెంట్‌ వెంటిలేటర్లు ఆ కొరతను తీర్చబోతున్నాయని చెప్పారు. అన్ని వెంటిలేటర్లు కరోనాను ఎదుర్కోలేవని, మెకనైజ్డ్‌ అంబు బ్యాగులు, సీపాప్, బైపాప్‌ మిషన్లు మాత్రమే ఈ వైరస్‌ చికిత్సకు అనుగుణంగా పనిచేస్తాయన్నారు.

వెంటిలేటర్ల తయారీకి వివిధ దేశాలు వైద్యపరంగా నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి దీనిని రూపొందించామన్నారు. ఇప్పుడున్న చాలా వరకు వెంటిలేటర్ల ద్వారా కరోనా రోగులకు ఎటువం టి క్లినికల్‌ ప్రయోజనాలు అందకపోగా, అవి ఊపిరితి త్తుల్లో గాయం ఏర్పడడాని కి కారణమవుతున్నాయన్నారు. ఐకో వెంట్‌ను కరోనా, న్యుమోనియా, ఏఆర్‌డీఎస్‌ (ఆక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిం డ్రోమ్‌) రోగుల కోసమే రూపొందించామన్నా రు. ఊపిరితిత్తుల సాధారణ సామర్థ్యం ఆధారంగా ఆక్సిజన్‌ను కచ్చిత పరిమాణంలో ఊపిరితిత్తుల్లోకి పంపి, బయటకు వదిలే క్రమంలో కచ్చితమైన ప్రెషర్‌ను ఇది అనుమతిస్తుందన్నా రు. దీనికి పేటెంట్‌ పొందినట్టు చెప్పారు.

ఆరున్నర వారాల పాటు శ్రమించి..
ఆరున్నర వారాల పాటు శ్రమించి ఐకో వెంట్‌ను రూపొందించినట్టు విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ముడి ఉత్పత్తుల సేకరణ కష్టమైందని, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులనే పోలీసుల సాయంతో సేకరించి, దీ నిని తయారుచేసినట్లు చెప్పారు. ఐకో వెంట్‌ను 3 మోడల్స్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్నా రు. హైదరాబాద్‌లో లభ్యమయ్యే ముడి ఉత్పత్తు ల ఆధారంగా రూపుదిద్దికునే మోడల్‌కు రూ. 1.20లక్షల నుంచి రూ.1.40లక్షల ధర నిర్దేశించామన్నారు. వరంగల్‌ వంటి పట్టణాల్లో లభ్యమ య్యే ముడి ఉత్పత్తులతో తయారయ్యే వెంటిలేట ర్‌ రూ.90 వేలు, అంతకంటే చిన్న పట్టణాల్లో ల భ్యమయ్యే ముడి వస్తువులతో తయారైన మోడ ల్‌ ధరను రూ.40–50వేలుగా నిర్ణయించామన్నా రు. మరో 2 – 3 వారాల పాటు కృత్రిమ ఊపిరితిత్తులపై దీనిని ప్రయోగించి అం దుబాటులోకి తీసుకువస్తామన్నారు. సీఎస్‌ఆర్‌ కింద 300 వరకు ప్రభుత్వాస్పత్రులకు అందిస్తా మన్నారు. వీటి తయారీలో భాగస్వామ్యానికి విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు.

మరిన్ని వార్తలు