చేరువలో వైద్యం

14 Oct, 2017 15:57 IST|Sakshi

మెదక్‌ ఏరియా ఆస్పత్రిలో ఐసీయూ ఏర్పాటు

నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు

హాజరు కానున్న డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్‌జోన్‌: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పేద ప్రజలకు వైద్యం మరింత చేరువ కానుంది. ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)ను భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. దీంతో అత్యవసర చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. పాము కాటు, విషం సేవించిన బాధితులు, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిని ప్రాణా పా యం నుంచి రక్షించేందుకు ఈ యూనిట్‌ ఉపయోగపడుతుంది. గతంలో బాధితులను హైదరాబాద్‌కు రెఫర్‌ చేసేవారు. అందులో చాలా మంది హైదరాబాద్‌కు చేరుకునేలోపే మరణిం చేవారు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదు. ఈ యూనిట్‌లో ఐదుగురు వైద్యులతో పాటు, ఐదుగురు ప్రత్యేక నిపుణులు, ఎక్స్‌రే, ల్యాబ్‌ టెక్నిషియన్స్, స్టాఫ్‌ నర్స్‌లు, నర్స్‌లు, అనస్తీషియా వైద్యులు ఉంటారు. ప్రత్యేక నిపుణులు ఇద్దరే వచ్చారు. మరో ముగ్గురు రావాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు