ఆదర్శంగా వాటర్‌గ్రిడ్

21 Apr, 2015 02:08 IST|Sakshi
ఆదర్శంగా వాటర్‌గ్రిడ్

ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు
ఈ ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాలు
ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి
తొలివిడతలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు మంచినీరు
ప్రాజెక్టుపై సమీక్షలో సీఎం కేసీఆర్
 

హైదరాబాద్: ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా అందించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలి చేలా చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. దీనికి సంబంధించి 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడిం చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్ల దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం సచివాలయంలో ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఇతర ఉన్నతాధికారులతో కలసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాజెక్టు పను లు వేగంగానూ, పారదర్శకంగానూ జరగాలని అధికారులకు సూచించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా, కరువు పీడిత మహబూబ్‌నగర్ జిల్లాలకు తొలిదశలో సురక్షితమైన తాగునీరు అందించి, ఆపై ప్రాజెక్టు పురోగతి మేరకు ఇతర జిల్లాలకు మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పారు.

నిధుల కొరత రానివ్వం: హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), నాబార్డ్ (నేషనల్  బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) సంస్థలు వాటర్‌గ్రిడ్‌లో రూ.13వేల కోట్లు పెట్టుబడులు పెట్టేం దుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఈ సంస్థలు మరో రూ.7వేల కోట్లు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పా రు. మరికొన్ని సంస్థలు, కేంద్రం నుంచి కూడా కొంతమేరకు నిధులు అందవచ్చన్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు సమాకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికారులు కూడా అదే పట్టుదలతో పనిచేయాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 26 ప్యాకేజీల్లో ఇప్పటికే 17 ప్యాకేజీలకు టెండర్లు పిలిచామని, మరో వారంలో మిగిలిన వాటికి టెండర్లు పిలుస్తామన్నారు. సీఎం స్పందిస్తూ.. దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని, మరో 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత విషయంలో రాజీపడవద్దని సీఎం నిర్దేశించారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించాక నిపుణుల కమిటీ పరిశీలనకు పంపి అవసరమైన సూచనలు తీసుకోవాలని సూచించారు.
 
రైల్వేశాఖ నుంచి బ్లాంకెట్ పర్మిషన్లు!
 
ప్రాజెక్టుకు సంబంధించి వివిధ స్థాయుల్లో 311 చోట్ల రైల్వే లైన్లు అడ్డొస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ వెంటనే దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పైప్‌లైన్లు రైల్వేలైన్ల క్రాసింగ్ కు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రెండు మూడు రోజుల్లో రైల్వేశాఖతో సమావేశమవ్వాలని అధికారులకు సూచించారు. అన్ని క్రాసింగ్‌లకు ఒకేసారి బ్లాంకెట్ పర్మిషన్లు పొందాలని అధికారులకు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థిక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మిశ్రా, వాటర్‌గ్రిడ్ ఎండీ శాలిని మిశ్రా, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు