'అవసరమైతే అవిశ్వాసతీర్మానం'

15 Sep, 2015 15:56 IST|Sakshi

హైదరాబాద్: అసెంబ్లీ కమిటీహాల్లో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం మంగళవారం సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారు.

అసెంబ్లీ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణాలు మొత్తం మాఫీ చేసేలా ప్రభుత్వం పై పోరాడాలని సీఎల్పీ తీర్మానం చేసింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం దిగొచ్చేవరకు అసెంబ్లీ స్తంభింప చేయాలని సీఎల్పీ నిర్ణయించింది. ప్రజా సమస్యలు చర్చకు రానీయకపోతే అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్ పై అవసరమైతే అవిశ్వాస తీర్మనం పెట్టాలని సీఎల్పీలో నిర్ణయించారు.

ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు