సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె

23 Jun, 2018 14:54 IST|Sakshi
భిక్షాటల చేస్తున్న డీలర్లు 

సాక్షి, పెద్దపల్లిరూరల్‌ : గౌరవ వేతనం చెల్లించడంతోపాటు పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని రేషన్‌డీలర్లు జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి వెం కటేశం మాట్లా డుతూ... కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబర్‌ నుంచి పెంచిన కమీషన్, పాత బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంచేయడం తగదన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించుకున్నా... ఇప్పటికి ఫలితం లేదని వాపోయారు.

బకాయి ఉన్న 400 కోట్ల రూపాయల కమీషన్‌ను వెంటనే చెల్లించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న బియ్యం పంపిణీతో తమకు అందే కమీషన్‌ రేటు సరిపోవడంలేదన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చేనెల ఒకటి నుంచి సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు మద్దెల నర్సయ్య, ఎలబోతారం శంకరయ్య, అడిచెర్ల రమేశ్, నంబయ్య, పెర్క లింగయ్య, కిషన్‌రెడ్డి, జయప్రద, పద్మ, సరస్వతీ, భారతీ, శ్రీనివాస్, ప్రభంజన్‌రెడ్డి, తోట శ్రీనివాస్, సత్యం, సాదిక్‌పాషా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు