ఐ గురు ఎలా పనిచేస్తుందంటే..

21 Sep, 2019 07:47 IST|Sakshi
డాక్టర్‌ హర్షవర్ధన్‌ కృష్ణ

యాప్‌ను రూపొందించిన నగర వైద్యుడు  

స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు మేలు

పిల్లలు ఎక్కడ ఉన్నారో తల్లిదండ్రులు తెలుసుకునే ఏర్పాటు

ఐ గురు (iguru) యాప్‌ను సృష్టించి స్కూల్‌లో చదివే పిల్లలకు, ముఖ్యంగా పేరెంట్స్‌కు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా పిల్లలు– పేరెంట్స్‌ మధ్య వారధిగా మార్చారు డాక్టర్‌ హర్షవర్ధన్‌ కృష్ణ. హాజరు నుంచి లీవ్‌ లెటర్‌ వరకు అన్నీ యాప్‌ ద్వారానే పొందేలా చేశారు. అంతేకాదు.. స్కూలుకు వెళ్లిన పిల్లలు ఎక్కడున్నారు.. ఇంటికి వచ్చేటప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా సులభంగా తెలుసుకునేలా యాప్‌ను రూపొందించారు.  

శ్రీనగర్‌కాలనీ: అతనో డాక్టర్‌.. విదేశాల్లో పనిచేశారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, ఉచిత వైద్య శిబిరాలు వంటి సామాజిక సేవల్లోనూ ముందున్నారు. అయినా ఆయనలో ఏదో వెలితి. తాను పుట్టిన గడ్డకు.. ఇక్కడి సమాజానికి సేవ చేయాలని పరితపించి తిరిగి భారత దేశం వచేంచశారు. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న ఆయన పర్యావరణానికి మేలు చేసేందుకు ‘పేపర్‌’ వినియోగాన్ని తగ్గించాలను నిర్ణయించుకున్నారు. చెట్లను నరికి కాగితాన్ని తయారు చేయడం వల్ల భూతాపం పెరిగిపోయిందని గ్రహించారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో పేపర్‌ వాడకం ఎక్కువగా మారిందని అంచనా వేసిన ఆయన ‘పేపర్‌లెస్‌’ విధానానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దాదాపు అన్ని విధులకు ఉపయోగపడేలా సౌకర్యాలు, హుంగులతో సరికొత్త యాప్‌కు శ్రీకారం చుట్టారు నగరానికి చెందిన డాక్టర్‌ హర్షవర్ధన్‌ కృష్ణ. అంతేకాదు.. ఆ యాప్‌ను స్కూల్స్, కాలేజీలకు ఉచితంగా అందింది టెక్నాలజీ వైపు వారిని మార్చి పేపర్‌లెస్‌ విధానం అవలంబించేలా చేశారు. ఎంతోమంది పేరెంట్స్‌కు ఉపయోపడే యాప్‌ను అందించిన ఆయన తన ప్రస్థానాన్ని, యాప్‌ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

పర్యావరణానికి మేలు చేయాలని..
మాది మహబూబ్‌నగర్‌ జిల్లా తాండ్ర గ్రామం. ఉస్మానియాలో ఎంబీబీఎస్‌ చేశాను. విదేశాల్లో 25 సంవత్సరాలు డాక్టర్‌గా సేవలందించాను. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, సామాజిక సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో దేశీ, విదేశాల్లో నిర్వహించేవాడిని. అయితే, పుట్టిన దేశానికి, సమాజానికి నా వంతు సాయం చేయాలన్న తపన నన్ను వెంటాడేది. అందుకోసం నగరానికి వచ్చేశాను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. మన దేశంలో పేపర్‌ కోసం చెట్లను అధికంగా నరికేస్తున్నారని తెలుసుకున్నాను. అందుకు అనుగుణంగా పేపర్‌లెస్‌ విధానం తీసుకు రావాలని భావించాను. ‘స్మార్ట్‌ టెక్నాలజీ’తోనే అది సాధ్యమవుతుందని.. అందుకు ‘ఐ గురు’ యాప్‌ను తయారు చేశాం.

ఐ గురు ఎలా పనిచేస్తుందంటే..  
స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ఇనిస్టిట్యూషన్స్‌లో పేపర్‌ను పూర్తిస్థాయిలో తగ్గించేలా అన్ని సౌకర్యాలతో ఐగురు యాప్‌ రూపకల్పన చేశాం. విద్యార్థులకు కాకుండా పేరెంట్స్‌కు ఈ యాప్‌ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. స్కూల్‌కు వెళుతూ, తిగిచి వచ్చే పిల్లలు ఎక్కడ ఉన్నారో స్పష్టంగా యాప్‌ జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలకు యాప్‌ ద్వారా క్షణాల్లో సెలవును తీసుకోవచ్చు. స్కూల్‌లో జరిగే ప్రతి విషయాన్ని, పిల్లల చదువుతో పాటు వారి రోజువారి దినచర్యలను ఈ యాప్‌తో తెలుసుకునే ఏర్పాట్లు కల్పించాం. ఇళ్లు, ఫోన్‌ నంబర్‌ మారినా సరే.. యాప్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు బోనఫైడ్‌తో పాటు ఎలాంటి సర్టిఫికెట్లను సులువుగా అప్లై చేయవచ్చు. ఫీజులు సైతం వాయిదాల పద్ధతిలో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టవచ్చు. పేరెంట్స్‌కు సింహభాగంగా పెద్దపీట వేసే విధంగా అన్ని హంగులతో యాప్‌ను తయారు చేసి పేపర్‌లెస్‌ గో గ్రీన్‌ ఇనిస్టిట్యూషన్స్‌కు అందించాం.

సామాజిక దృక్పథంతో స్కూల్స్, కాలేజీలకు ఏడాది పాటు ఉచితంగా యాప్‌ను అందించాం. వందలాది స్కూల్స్‌కు యాప్‌ను ఎలా వాడాలో తెలిపే టీమ్‌తో వారికి అవగాహన కల్పించాం. యాప్‌ను వాడిన ఇనిస్టిట్యూషన్స్‌ సంతృప్తి వ్యక్తం చేశాయి. ఏడాది తర్వాత కేవలం మెయింటనెన్స్‌ కోసం ఒక్కో విద్యార్థికి చాలా తక్కువ ఫీజుతో ఈ యాప్‌ను ఇనిస్టిట్యూషన్స్‌కు అందిస్తున్నాం. ఐ–గురు యాప్‌ వాడిన పేరెంట్స్‌ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను డాక్టర్‌గా పనిచేసినా ఓ సదుద్దేశంతో చేస్తున్న ఈ పని చాలా సంతృప్తినిస్తోంది.. అంటూ ముగించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా